SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బాగా అలసిపోయా.. కొన్ని రోజులు వియత్నాం వెళ్లొస్తా! రాహుల్‌ గాంధీ ఫ్లైట్‌ వీడియోపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు! కాంగ్రెస్‌ కౌంటర్‌ ఏంటంటే?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లడంతో, ఆయన విమానంలో ఉన్న వీడియోను బీజేపీ షేర్ చేస్తూ వ్యంగ్యంగా విమర్శలు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 21, 2026, 08:28 AM IST | Updated: Oct 21, 2026, 08:33 AM IST
Image Credit: Rahul Gandhi Vietnam Tour
Join

Rahul Gandhi Vietnam Tour: సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో, రాహుల్ గాంధీ విదేశీ పర్యటన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వియత్నాం వెళ్తున్న రాహుల్ గాంధీ వీడియోను బీజేపీ షేర్ చేస్తూ, 'అబద్ధపు ప్రచారం చేసి అలసిపోయాను.. ఇక వియత్నాం వెళ్లొస్తా' అంటూ ఎక్స్ వేదికగా షేర్‌ చేసి సెటైర్లు వేసింది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి తీసిన దృశ్యాలు ఉన్నాయి. దీనిపై బీజేపీ నేత ఆర్పి సింగ్ మాట్లాడుతూ, రాహుల్ ప్రతిసారి ఇలాగే విదేశాలకు వెళ్తారని, గతంలో బీహార్ పర్యటన తర్వాత కూడా ఆయన రెండు నెలల పాటు విహారయాత్రకు వెళ్లారని పేర్కొన్నారు.

దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై సందీప్ దీక్షిత్ స్పందన తెలిపారు. ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు, అందులో తప్పేముంది? అందరూ విదేశాలకు వెళ్తుంటారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు వ్యక్తిగత పనులు ఉంటాయి. లండన్‌లోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను కలవడం, మేధావులతో చర్చించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. ఇందులో తప్పు ఏముంది? ప్రధానమంత్రి చేయలేరా? అని ప్రశ్నించారు.

మరోవైపు, సీఈసీ రాజీనామా డిమాండ్‌పై కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి సుప్రీంకోర్టుకు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను కలుస్తామని కూటమి నేతలు తెలిపారు. మార్చిలో జరిగిన ఈ ప్రయత్నంలో రాహుల్, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అయితే, సుప్రీంకోర్టు ఈ అంశంపై మండిపడుతూ, న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరని సీజేఐ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లతో సహా పలువురికి నోటీసులు జారీ చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

 

 

ఇక ఈసీ జ్ఞానేష్ కుమార్ విషయంలో సీజేపీ దీప్కే, రాహుల్ గాంధీ ఒకే పక్షం కావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడిగా పోరాడటం విషయంలో జాగ్రత్త అవసరమని రాహుల్ సన్నిహితులు సూచిస్తున్నారు. గతంలో AAP మద్దతు వల్ల పంజాబ్‌లో ఎదురైన పరిణామాలను కూడా వారు గుర్తు చేస్తున్నారు.

Read Also: టాటా సంస్థలో ఆధిపత్య పోరాటం.. కోర్టు మెట్లు ఎక్కిన టాటా సంస్థ ప్రతినిధులు..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES