వామ్మో.. భారీ పామును సింపుల్‌గా పట్టుకున్న బుడ్డోడు.. వైరల్ వీడియో
Giant Snake Video: తాజాగా ఒక పిల్లాడు అత్యంత పొడవైన పామును పట్టుకుంటున్న దృశ్యాలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోలో బాలుడు ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తుల చాకచక్యంగా ఓ పాములు పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు వైరల్‌గా మారాయి.. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Giant Snake Video: పాము పేరు వింటేనే ఎంతటి సాహసం చేసేవారైనా.. గుండెల్లో గుబులు రేగడం సహజం.. కొన్ని విషపూరితమైనవి కాకపోయినప్పటికీ.. నేలపై మెలికలు తిరుగుతూ వెళ్లే సర్పాలు కనిపించిన జనం సురక్షితంగా ఉండేందుకు అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటారు. ఓ బుడ్డోడు మాత్రం ఎవరు ఊహించని ధైర్యాన్ని దర్శిస్తూ వచ్చాడు.. అనుకోకుండా ప్రజల నివాసాల్లోకి చొరబడిన ఒక భారీ సర్పన్ని చూసి బెదిరిపోకుండా.. ఎంతో సమయస్ఫూర్తితో దానిని కాపాడి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఇళ్ల మధ్యలోకి అనుకోకుండా ఒక పొడవైన సర్పం సంచారం చేస్తూ వచ్చింది.. చుట్టుపక్కల వారు భయంతో చూస్తుండగానే దాదాపు 8 నుంచి 9 ఏళ్లు కలిగిన ఒక బాలుడు ఏ మాత్రం భయపడకుండా తన చేతిలో ఉన్న స్నేక్ పట్టుకొని ముందుకు సాగాడు.. పాము శరీరంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా.. దాని మెడ భాగంలో స్టిక్ను ఉంచి దానిని ఎంతో అద్భుతంగా నియంత్రించాడు. పాము కదలికలకు అనుకూలంగా అడుగులు వేస్తూ.. ప్రాణాపాయం కలగకుండా దానిని పట్టుకున్నాడు. ఆ తర్వాత దానిని అక్కడున్న స్థానికులకు చూపిస్తూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు..
ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అందరూ ఆ బాలుడిని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. అంత చిన్న వయసులో అత్యంత పొడవైన పామును పట్టుకొని రక్షించిన తీరును అందరూ పొగుడుతున్నారు.. ఇంత చిన్న వయసులోనే వన్యప్రాణులపై ఇంతటి అవగాహన.. జంతువులను హింసించకుండా కాపాడాలని సంకల్పం ఉండడం గర్వించదగ్గ విషయం అంటూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు. మరికొంతమంది ఈ వీడియోను చూసి శభాష్ బేటా అంటూ కామెంట్లు పెడుతున్నారు..
అదే సమయంలో వన్యప్రాణి సంరక్షకులు ఆ బాలుడికి తీవ్రమైన సూచనలు చేస్తూ వస్తున్నారు. బాలుడి నైపుణ్యం మెచ్చుకోదగినదే అయినప్పటికీ ఇలాంటి సాహసాలు పిల్లల ప్రాణాలకే ముప్పు తెస్తాయని వారు చెబుతున్నారు. నివాస ప్రాంతాల్లో పాములు కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు లేదా ఇక్కడ ఉండే పెద్ద స్నేక్స్ కైనా సమాచారం అందించడం మంచిదని.. ఇలా పిల్లలతో పాములు పట్టించడం ఏమాత్రం మంచిది కాదని వన్యప్రాణి సంరక్షకులు సూచిస్తూ వస్తున్నారు..