• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /బడ్జెట్ తలకిందులు.. భగ్గుమంటున్న పప్పులు, నూనెలు, సన్న బియ్యం ధరలు!

బడ్జెట్ తలకిందులు.. భగ్గుమంటున్న పప్పులు, నూనెలు, సన్న బియ్యం ధరలు!

ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు పప్పులు, నూనెల ధరల పెరుగుదల కొనసాగుతుండగా, ఇప్పుడు సన్న బియ్యం ధరలు కూడా భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరల వల్ల కుటుంబ బడ్జెట్లు అస్తవ్యస్తమవుతుండగా, బియ్యం ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. దసరా, దీపావళి పండుగలను కుటుంబంతో సంతోషంగా గడపాలన్న ఆశతో సరుకులు సమకూర్చుకోవాలనుకునే వారి జేబులకు చిల్లు పడుతోంది. అసలే ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి సన్న బియ్యం ధరల పెరుగుదల మరో భారంగా మారింది.

Written ByRenuka Godugu
Published: Oct 20, 2026, 04:30 PM IST|Updated: Oct 20, 2026, 04:34 PM IST
joinshare
బడ్జెట్ తలకిందులు.. భగ్గుమంటున్న పప్పులు, నూనెలు, సన్న బియ్యం ధరలు!
Image Credit: Essential Commodities Price Hike

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Mohali Delivery Person:  కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..

Mohali Delivery Person: కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..

2

Chandrababu: స్థానిక ఎన్నికల్లో 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలి: చంద్రబాబు

3

బడ్జెట్ తలకిందులు.. భగ్గుమంటున్న పప్పులు, నూనెలు, సన్న బియ్యం ధరలు!

4

Himachal Pradesh: దేశ మంతా దసరా తర్వాత.. ఇక్కడ వారంపాటు సంబరాలు.!. హిమాచల్ ప్రదేశ్‌లో వింత సంప్రదాయం.!.

5

Graduate MLC: తొలిసారి ఎన్నికల బరిలో కవిత పార్టీ.. కీలక స్థానానికి అభ్యర్థి ప్రకటన

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

కడుపు నింపే బియ్యం ధరలు ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. నిత్యం ప్రతి ఇంట్లో అవసరమయ్యే సన్న బియ్యం ధరలు పెరగడం వల్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నెలవారీ సరుకుల జాబితాలో బియ్యం కోసం కేటాయించే మొత్తానికి ఇప్పుడు మరింత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇప్పటికే పప్పులు, నూనెలు మరియు ఇతర నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల కుటుంబ ఖర్చులు భారమయ్యాయి. ఇప్పుడు బియ్యం ధరలు కూడా పెరగడంతో నెలవారీ బడ్జెట్‌ను ఎలా నిర్వహించాలో తెలియక సామాన్య కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.

ప్రొవిజన్స్ రేట్లు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. ఉదాహరణకు, రూ.100 ఉండే కందిపప్పు రూ.140 అయిపోయింది. తినే పప్పులు, నూనె ధరలు అన్నీ విపరీతంగా పెరిగాయి. గతంలో నాలుగు ప్యాకెట్లు తీసుకునేవారు, ఇప్పుడు రెండు ప్యాకెట్లతోనే సర్దుకుపోవాల్సి వస్తోంది. బియ్యం ప్యాకెట్ ధర కూడా పెరిగింది. నూనె ధర రూ.100-105 ఉండేది, ఇప్పుడు హోల్ సేల్ ధర రూ.150 ఉండగా, బయట కొంటే ఒక ఆయిల్ ప్యాకెట్ రూ.175 వరకు పడుతోంది. పప్పులు, బియ్యం కూడా అంతే పరిస్థితి. బియ్యం రేటు రూ.1400-1500 ఉండేది, ఇప్పుడు క్వాలిటీ బియ్యం కావాలంటే రూ.2000 వరకు పడుతోంది. చక్కెర ధర రూ.40-45 ఉండేది, ఇప్పుడు రూ.70 అయిపోయింది.

పండుగలు దగ్గరపడుతున్న తరుణంలో రేట్లు విపరీతంగా ఉండటంతో కొనుగోలు చేయడం కష్టమవుతోంది. ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. ధరలు ఒకసారి రూ.45 నుండి రూ.75కి, మళ్ళీ రూ.50కి, ఆపై రూ.65కి మారుతూ అస్థిరంగా ఉన్నాయి.
మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. సంపాదనలో ఎక్కువ భాగం ఇంటి అద్దె, పిల్లల చదువులు, ప్రయాణ ఖర్చులు, వైద్యం, నిత్యావసరాలకే ఖర్చవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బియ్యం ధరలు పెరగడం వల్ల ప్రభావం నేరుగా కుటుంబ బడ్జెట్‌పై పడుతోంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన రోజువారీ కూలీలు ఈ ధరల పెరుగుదలను తట్టుకోవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో సభ్యుల సంఖ్యను బట్టి బియ్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బియ్యం కొనుగోలులో చేసే ఖర్చు చిన్నదిగా అనిపించినా, నెలవారీ లెక్కలు వేసుకుంటే అది పెద్ద భారంగా మారుతోంది.

పండుగల సమయంలో కొత్త బట్టలు, పిండివంటలు, బంధుమిత్రుల రాకతో అదనపు ఖర్చులు ఉంటాయి. నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉండటంతో, పండుగ ఖర్చులు భారంగా మారుతున్నాయి. పండుగ కోసం సరుకులు ముందుగానే కొనుగోలు చేయాలన్నా ధరల భయం వెంటాడుతోంది. నూనె ధరలు కూడా రోజురోజుకూ రూ.30-50 పెరుగుతూనే ఉండటం వల్ల సామాన్యులు బతకడం కష్టంగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించి సహాయం చేయాలని వారు విన్నవించుకుంటున్నారు.

Read Also: రేపు అక్టోబర్ 21న ఎస్‌బీఐ, పీఎన్‌బీ సహా ఇతర బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?
Read Also: దీపావళికి ముందే రూ.2000 జమవుతాయా? PM కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్!

మార్కెట్‌కు వెళ్లే వినియోగదారులు ప్రతి వస్తువు ధర చూసి ఆలోచిస్తున్నారు. ఏ వస్తువు ఎంత ధరకు లభిస్తుందో చూసుకుని, అవసరమైన వాటిని ముందుగా కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవాల్సి వస్తోంది. సన్న బియ్యం ఎక్కువగా వాడే కుటుంబాలపై ఈ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. కొందరు తమ బడ్జెట్‌కు తగ్గ రకం బియ్యాన్ని ఎంచుకుంటుంటే, మరికొందరు కొనుగోలు చేసే పరిమాణాన్ని తగ్గించుకుంటున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు కారణాలను విచారించి, మార్కెట్లో ధరల నియంత్రణ కోసం అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ధరల పెరుగుదలకు కారణమైన సప్లై, డిమాండ్ లేదా రవాణా వంటి అంశాలను పరిశీలించి, వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి. ప్రతిరోజూ అవసరమయ్యే ప్రధాన ఆహార పదార్థం బియ్యం కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాంటి బియ్యం ధరలు పెరిగితే దాని ప్రభావం ప్రతి ఇంటిపై పడుతుంది. ఇప్పటికే పప్పులు, నూనెలు వంటి ఇతర నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సన్న బియ్యం ధరల పెరుగుదల మరో సమస్యగా మారింది. విజయదశమి, దీపావళి పండుగల సమయాల్లో ధరలు మరింత భారంగా మారకుండా ప్రభుత్వం , సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Festivals