Kullu Dussehra festival 2026 in Himachal Pradesh: దేశ వ్యాప్తంగా దసరా, విజయ దశమి సంబరాలను ప్రజలు ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. అయితే దసరా అంటే శమీ పూజ, పాలపిట్టను దర్శించుకొవడం, రావణ సంహారం, బంగారం ఒకరికి మరోకరు ఇచ్చుకొవడం వంటి సంప్రదాయాలను పాటిస్తు వస్తున్నాం. అయితే హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని ఏళ్లుగా అంతర్జాతీయ కులు దసరా ఉత్సవంను నిర్వహిస్తారు. దీన్ని దసరా మరుసటి రోజు నుంచి వారం పాటు ఇక్కడ పెద్ద సంబురంగా నిర్వహిస్తారు. అక్టోబరు 21 నుంచి 27 వరకు ఈసారి కులు సంబరాలు ఉండనున్నాయి. దీనిలో ప్రధానంగా
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లూ లోయ అధిష్టాన దేవత అయిన హిడింబా అమ్మవారిని పూజించుకుంటారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ నుంచి కుల్లూ వరకు ఇక్కడ భక్తులు శ్రీరాముడి పల్లకీలను ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు.
ఈయాత్రలో మాతా హిడింబ అమ్మవారిని ఊరేగింపు సమయంలో చాలా మంది భక్తులు ఇక్కడకు వస్తారు. అసలు హిడింబ మాత వచ్చాక మాత్రమే ఇక్కడ దసరా పండగ మొదలౌతుందని నమ్ముతారు. మాతా హిడింబా కులు లోయకు అధిష్టాన దేవత అని, దసరా పండుగకు రక్షకురాలని నమ్ముతారు.
వారం పాటు హిమచల్ ప్రదేశ్ లోనిచుట్టుపక్కల గ్రామా దేవతల పల్లకిలు కులుకు చేరుకుంటాయి. దీనిలో శ్రీరాముడి రథయాత్రను ఎంతో ముఖ్యమైనదిగా చెప్తారు. కులు ప్రాంతాన్ని ‘దేవభూమి’గా పిలుస్తారు. అదే విధంగా.. 200కు పైగా గ్రామ దేవతలు ఈ ఉత్సవంలో పాల్గొనే సంప్రదాయం ఉంది.
ఇక దసరా రోజున అంటే చివరి రోజున రావణుడిని దహనం చేయరు. దానికి బదులుగా గడ్డి పొదలను దహనం చేయడంను ఆచారంగా పాటిస్తుంటారు. ఈ విధంగా హిమచల్ ప్రదేశ్ లో కులు దసరాను గ్రాండ్ గా జరుపుకుంటారు.