• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Chandrababu: స్థానిక ఎన్నికల్లో 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలి: చంద్రబాబు

Chandrababu: స్థానిక ఎన్నికల్లో 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలి: చంద్రబాబు

Chandrababu Review And Key Orders To TDP Leaders: స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినట్టు 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థులకు సహకరిస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 20, 2026, 04:58 PM IST|Updated: Oct 20, 2026, 05:01 PM IST
joinshare
Chandrababu: స్థానిక ఎన్నికల్లో 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలి: చంద్రబాబు
Image Credit: Chandrababu Tele Conference

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Mohali Delivery Person:  కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..

Mohali Delivery Person: కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..

2

Chandrababu: స్థానిక ఎన్నికల్లో 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలి: చంద్రబాబు

3

బడ్జెట్ తలకిందులు.. భగ్గుమంటున్న పప్పులు, నూనెలు, సన్న బియ్యం ధరలు!

4

Himachal Pradesh: దేశ మంతా దసరా తర్వాత.. ఇక్కడ వారంపాటు సంబరాలు.!. హిమాచల్ ప్రదేశ్‌లో వింత సంప్రదాయం.!.

5

Graduate MLC: తొలిసారి ఎన్నికల బరిలో కవిత పార్టీ.. కీలక స్థానానికి అభ్యర్థి ప్రకటన

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chandrababu Tele Conference: సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలని పార్టీ నాయకులకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు. రెబల్స్‌ వేసిన నామినేషన్‌లను ఉపసంహరించుకునేలా చూడాలని.. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి పార్టీలు సమన్వయంతో వ్యవహరించాలని నేతలకు ఆదేశించారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరించుకునేలా చేయాలి. పార్టీ అధికారిక అభ్యర్థులకు త్వరగా బీ-ఫారాలు అందచేయాలి. పార్టీ ఆదేశాలను కాదని ముందుకెళ్తే పార్టీ నుంచి తప్పకుండా చర్యలు తీసుకుంటాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కూటమి నుంచి సీట్లు కేటాయించిన వారిని గెలిపించాల్సిందేనని స్పష్టం చేశారు. కూటమిగా 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు స్వతంత్రంగా వేయడం సరికాదని సూచించారు. కేటాయించిన స్థానాల్లో సమర్ధవంతమైన అభ్యర్ధులను నిలబెట్టాలని చెప్పారు.

'తాత్కాలిక ప్రయోజనాల కోసం అభ్యర్ధులను నిలబెట్టవద్దు. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుని బలాబలాలను చూసుకుని సమర్ధులను ఎంపిక చేయాలి. ఇంటింటి ప్రచారం చేపట్టాలి. బూత్ స్థాయి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి. నిరంతరం సేవ చేస్తూ ఉంటేనే లీడర్లు అవుతారు' అని పార్టీ నాయకులకు అధినేత చంద్రబాబు సూచించారు. 'ఈ నెల సమయం మన పనితనానికి పరీక్ష. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు కూడా త్వరలో జరుగుతాయి. అన్నింటిలో సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలి' అని దిశానిర్దేశం చేశారు.

'నేను ముఖ్యమంత్రిగానే కాకుండా ఎన్నికలయ్యే వరకూ ఒక పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యకర్తలగానే పని చేయాలి. విలువలు లేకుండా చేసే రాజకీయం, రౌడీయిజం, అధికారం దుర్వినియోగంతో చేసే రాజకీయం ఎప్పుడూ నిలబడదు' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు. 11 కార్పొరేషన్లు 11 సామాజికవర్గాలకు కేటాయించామని.. అన్ని కులాలను రాజ్యాధికారంలో భాగం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వేలమందికి ఈ ఎన్నికలతో ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని.. ప్రజలు ఆమోదించిన వారిని , ప్రజల్లో గుర్తింపు ఉన్నవారిని ఎంపిక చేయండి అని సూచించారు.

'గ్రామాల్లో మంచి నాయకులు లేకపోతే ఆ గ్రామంలో కూడా పార్టీ బలహీన పడుతుంది. సమర్ధులను నియమించుకుంటే పార్టీ పటిష్టంగా ఉంటుంది. కార్యకర్తలు పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు స్థానిక ఎన్నికలనేవి మంచి అవకాశం' అని పార్టీ నాయకులకు చంద్రబాబు తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వేలాది మందికి స్థానిక ఎన్నికల్లో సీట్లు ఇవ్వవచ్చని.. సమీకరణాలు, పొత్తుల్లో భాగంగా ఎవరికైనా సీట్లు ఇవ్వలేకపోతే... అలాంటి వారికి నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Chandrababu Naidu
TDP
Elections
Andhra Pradesh
AP News