SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

BSNL బంపర్ ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌తో 395 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

ప్రభుత్వ దిగ్గజ కంపెనీ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ బంపర్‌ ఆఫర్ అందిస్తోంది. ప్రతినెలా రీఛార్జీ గొడవ లేకుండా ఒక్కసారి రీఛార్జీ చేసుకుంటే ఏడాది మొత్తం ఎంజాయ్‌ చేసే ప్లాన్.. అందే రూ.2799 ప్లాన్‌ ఇందులో ప్రతిరోజూ 3 జీబీ డేటా కూడా పొందుతారు. ఈ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 13, 2026, 01:44 PM IST | Updated: Nov 13, 2026, 01:51 PM IST
Image Credit: BSNL Rs 2799 Plan Offers:
Join

BSNL Rs 2799 Plan Offers: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ రీఛార్జీ ప్లాన్స్‌ సాధారణంగానే ధర తక్కువగా ఉండే ప్లాన్స్‌ పరిచయం చేస్తుంది.  ఈ ప్రభుత్వ దిగ్గజ టెలికాం కంపెనీ బడ్జెట్‌ ఫ్రెండ్లీలో ఏడాది మొత్తం ఎంజాయ్‌ చేసే ప్లాన్‌ తీసుకువచ్చింది. దీని ధర కేవలం రూ.2799 మాత్రమే. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కూడా ఏడాది పాటు లభిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ బెనిఫిట్స్‌ పొందుతారు. ప్రస్తుతం టెలికాం కంపెనీలు 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నాయి కాబట్టి మొత్తం 395 రోజులు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం. ఇందులో మరో 30 రోజులపాటు అదనపు వ్యాలిడిటీ కూడా లభిస్తుంది.

ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2799 ప్లాన్‌ వ్యాలిడిటీ 395 రోజులు వర్తిస్తుంది. ప్రతినెలా రీఛార్జీ గొడవ లేకుండా ఒక్కసారి రీఛార్జీ చేస్తే ఏడాదికిపైగా ఎంజాయ్‌ చేసే ప్లాన్‌. ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌తో రీఛార్జీ చేస్తే అదనంగా ఒక నెల స్పెషల్‌ ఆఫర్ బెనిఫిట్‌ లభిస్తుంది.

ఈ ప్లాన్‌తో ప్రతిరోజు 3 జీబీ డేటా లభిస్తుంది. దీంతో ఎక్కువగా వీడియో స్ట్రీమింగ్‌, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ క్లాసుు, వీడియో కాల్స్‌, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ ఏ ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా ఎంజాయ్‌ చేయవచ్చు. మొత్తం 395 రోజులు అంటే 1185 జీబీ డైలీ డేటా పొందవచ్చు.

బీఎస్ఎన్‌ఎల్‌ రూ.2799 ఏడాది ప్లాన్‌లో కేవలం డేటా మాత్రమే కాదు.. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ బెనిఫిట్‌ లభిస్తుంది. ఇందులో లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు.

Read Also: నెలవారీ రీఛార్జ్ గోల లేదు.. 365 రోజులకు కేవలం రూ.2399 మాత్రమే! BSNL బంపర్ ప్లాన్ వివరాలివే!

Read Also: అవాక్కయ్యే ఆఫర్ ఇచ్చిన ఎయిర్‌టెల్.. రూ. 349 ప్లాన్‌పై 1+1 ఉచిత ఆఫర్.. రోజూ 2GB డేటా, అపరిమిత 5G!

ఇక ఇందులో మరో అదనపు బెనిఫిట్‌ ఏంటంటే 100 ఎస్‌ఎంఎస్‌లు ప్రతిరోజూ పొందుతారు. దీంతో బ్యాంకింగ్‌ అలెర్ట్స్‌, ముఖ్యమైన మెసేజ్‌లు, ఇతర పనులు చేసుకోవచ్చు. సింగిల్‌ రీఛార్జీలోని డేటా, కాలింగ్‌, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్‌ పొందుతారు.

అదనపు వ్యాలిడిటీ ఎలా?
ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లో ప్రత్యేక ఫీచర్‌ ఏంటంటే? బీఎస్‌ఎన్ఎల్‌ ప్రమోషనల్‌ ఫీచర్‌లో భాగంగా 30 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభిస్తుంది. ఇది నవంబర్‌ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. గతంలో కేవలం 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభించేది. ప్రస్తుతం 395 రోజులకు వ్యాలిడిటీ పెంచారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES