• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /BSNL: కేవలం రూ.51కే 2GB రోజువారీ డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్.. ఫ్రీ సిమ్ కూడా!

BSNL: కేవలం రూ.51కే 2GB రోజువారీ డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్.. ఫ్రీ సిమ్ కూడా!

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బడ్జెట్ ధరలో ఆఫర్లను అందిస్తోంది. ఈ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ 501 రూపాయలతో ఉచిత సిమ్‌తో పాటు రెండు జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ సేవలను అందిస్తోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 15, 2026, 16:17 IST|Updated: Nov 15, 2026, 16:22 IST
joinshare
BSNL: కేవలం రూ.51కే 2GB రోజువారీ డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్.. ఫ్రీ సిమ్ కూడా!
Image Credit: BSNL Rs 51 Recharge Plan 2026:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

BSNL Rs 51 Recharge Plan 2026: ఈ కాలంలో టెలికాం కంపెనీలు యూజర్ల నడ్డి విరుస్తున్నాయి. రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవాలంటే రోజురోజుకు ధరలు మరింత భారంగా మారుతున్నాయి. ఈ సమయంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో కొత్త సిమ్ కార్డుతో పాటు బీఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ కాలింగ్ కేవలం రూ.51 కే అందుబాటులో ఉంది. ఈ బీఎస్ఎన్ఎల్ ఆఫర్‌ను కొన్ని రోజులు మాత్రమే ప్రత్యేకంగా పరిచయం చేశారు. 2026 నవంబర్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మీరు కూడా ఈ ప్లాన్ ఎంచుకోవాలనుకుంటే, వివరాలు ఇవే.

కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ కొనుగోలు చేయాలనుకునే వారికి, సిమ్ కనెక్షన్‌తో కేవలం రూ.51 కే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో ప్రతి రోజు 2 జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 56 జీబీ డేటా పొందుతారు.

ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వ్యాలిడిటీ సమయంలో లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా లభిస్తాయి. అంతేకాదు, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా అందిస్తారు. ఇంటర్నెట్‌తో పాటు కాలింగ్ సౌకర్యం కావాలంటే ఈ ప్లాన్ ఎంచుకోవాల్సిందే. ఒకే ప్లాన్‌తో ఇవన్నీ పొందవచ్చు.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ కేవలం కొత్తగా సిమ్ కొనుగోలు చేసిన యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఇది వర్తించదు. మీరు ఎయిర్‌టెల్ వినియోగదారులైతే, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారినా ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది. ఆలస్యం చేయకుండా త్వరగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also: నెలవారీ రీఛార్జ్ గోల లేదు.. 365 రోజులకు కేవలం రూ.2399 మాత్రమే! BSNL బంపర్ ప్లాన్ వివరాలివే!

Read Also: అవాక్కయ్యే ఆఫర్ ఇచ్చిన ఎయిర్‌టెల్.. రూ. 349 ప్లాన్‌పై 1+1 ఉచిత ఆఫర్.. రోజూ 2GB డేటా, అపరిమిత 5G!

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ రూ. 51 ఆఫర్ కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2026 నవంబర్ 30వ తేదీ వరకే గడువు ఉంది.. ఆ తర్వాత ఈ ఆఫర్ ఉండకపోవచ్చు. ఈ ఆఫర్ పొందాలంటే కస్టమర్లు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలి. లేదా ఎయిర్‌టెల్, జియో వినియోగదారులైతే ఈ సమయంలోనే బీఎస్ఎన్ఎల్‌కు మారితే ప్రయోజనం పొందగలరు. ప్రమోషన్లలో భాగంగా బీఎస్ఎన్ఎల్ వివిధ సర్కిళ్లలో ఈ ప్లాన్ వివరాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటోంది. కేవలం రూ.51 తో కొత్త సిమ్ కొనుగోలు చేయడమే కాకుండా, ప్రతి రోజు 2 జీబీ డేటా కూడా పొందవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఇందులో లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్‌కు మారాలనుకునే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
Recharge Plans
National News
Telugu News