• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. 60 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. 60 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం

Bumper Jackpot To Govt Employees Sikkim Government Announces DA Hike: పండుగ సీజన్‌ వస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే నిర్ణయాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా ప్రభుత్వం డీఏ భారీగా పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. 60 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Oct 01, 2026, 04:57 PM IST|Updated: Oct 01, 2026, 05:06 PM IST
joinshare
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌.. 60 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం
Image Credit: Sikkim DA Hike

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Govt Employees DA Hike: దసరా, దీపావళి పండుగ సీజన్‌ రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రతియేటా ఉద్యోగులకు రెండుసార్లు ప్రకటించే కరువు భత్యం (డీఏ) ప్రకటిస్తారు. ఒకటి జనవరి కాగా రెండోది జూలైలో డీఏ ఇస్తారు. జూలై నెలకు సంబంధించిన డీఏను దసరా, దీపావళి సమయంలో దేశంలోని రాష్ట్రాలు ఉద్యోగులకు ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలోనే దేశంలోని అతి చిన్న రాష్ట్రమైన సిక్కిం తమ ఉద్యోగులకు డీఏను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 60 శాతం డీఏ ప్రకటిస్తూ సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

సిక్కిం ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 58 శాతం నుంచి 60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక శాఖ కూడా సవరించిన వేతన విధానం కింద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కరువు భృతిని 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. సవరించక ముందు ఉన్న వేతన విధానం ప్రకారం జీతాలు లేదా పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ), డీఆర్‌లను 257 శాతం నుంచి 262 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ డీఏ పెంపు అనేది ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఇతర ఉద్యోగులకు కూడా వర్తించనుంది. సాధారణ రాష్ట్ర ప్రభుత్వ స్కేళ్ల కింద సవరించిన వేతనం పొందుతున్న అర్హులైన కాంట్రాక్ట్, వర్క్-ఛార్జ్డ్‌ ఉద్యోగులకు కూడా ఈ సవరించిన రేట్లు ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుంది. సవరించిన, సవరించక ముందు ఉన్న రెండు వేతన నిర్మాణాల కింద అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధిత పెంపులను ఆర్థిక శాఖ ఇంకా అందించింది. సిక్కిం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. డీఏ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులు, డీఆర్‌ పెంపుతో పింఛన్‌దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పండుగ సీజన్‌ సందర్భంగా డీఏ, డీఆర్‌కు సంబంధించిన నిర్ణయాలను దేశంలోని పలు రాష్ట్రాలు ప్రకటించాయి. కొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటకతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా తమ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు డీఏ, డీఆర్‌ ప్రకటించనున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే డీఏ, డీఆర్‌పై ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ప్రకటించే వాటితో తమకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఆభావం వ్యక్తం చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
DA Hike
Employees
Dearness Allowance
Telugu News
National News