DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్.. 60 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం
Bumper Jackpot To Govt Employees Sikkim Government Announces DA Hike: పండుగ సీజన్ వస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే నిర్ణయాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా ప్రభుత్వం డీఏ భారీగా పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. 60 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees DA Hike: దసరా, దీపావళి పండుగ సీజన్ రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రతియేటా ఉద్యోగులకు రెండుసార్లు ప్రకటించే కరువు భత్యం (డీఏ) ప్రకటిస్తారు. ఒకటి జనవరి కాగా రెండోది జూలైలో డీఏ ఇస్తారు. జూలై నెలకు సంబంధించిన డీఏను దసరా, దీపావళి సమయంలో దేశంలోని రాష్ట్రాలు ఉద్యోగులకు ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలోనే దేశంలోని అతి చిన్న రాష్ట్రమైన సిక్కిం తమ ఉద్యోగులకు డీఏను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 60 శాతం డీఏ ప్రకటిస్తూ సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
సిక్కిం ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 58 శాతం నుంచి 60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక శాఖ కూడా సవరించిన వేతన విధానం కింద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కరువు భృతిని 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. సవరించక ముందు ఉన్న వేతన విధానం ప్రకారం జీతాలు లేదా పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ), డీఆర్‌లను 257 శాతం నుంచి 262 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ డీఏ పెంపు అనేది ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఇతర ఉద్యోగులకు కూడా వర్తించనుంది. సాధారణ రాష్ట్ర ప్రభుత్వ స్కేళ్ల కింద సవరించిన వేతనం పొందుతున్న అర్హులైన కాంట్రాక్ట్, వర్క్-ఛార్జ్డ్ ఉద్యోగులకు కూడా ఈ సవరించిన రేట్లు ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుంది. సవరించిన, సవరించక ముందు ఉన్న రెండు వేతన నిర్మాణాల కింద అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధిత పెంపులను ఆర్థిక శాఖ ఇంకా అందించింది. సిక్కిం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. డీఏ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులు, డీఆర్ పెంపుతో పింఛన్‌దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పండుగ సీజన్ సందర్భంగా డీఏ, డీఆర్‌కు సంబంధించిన నిర్ణయాలను దేశంలోని పలు రాష్ట్రాలు ప్రకటించాయి. కొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటకతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా తమ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు డీఏ, డీఆర్ ప్రకటించనున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే డీఏ, డీఆర్‌పై ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ప్రకటించే వాటితో తమకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఆభావం వ్యక్తం చేస్తున్నారు.