SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Youtuber Madhumitha: యూట్యూబర్ మధుమితపై కేసు.. వృద్ధుడిని ట్రాప్ చేసి అలాంటి పని.!. బైటపడ్డ షాకింగ్ విషయాలు.!.

Case on youtuber madhumitha: ఇటీవల సోషల్ మీడియాలో డబ్బులు కట్టలతో వివాదాస్పదంగా మారిన యూట్యూబర్ మధుమిత మరో చిక్కుల్లో పడింది. ఏకంగా ఆమె ఒక 89 ఏళ్ల వృద్ధుడిని ట్రాప్ చేసి ఆయన మెడలోని బంగారు గొలుసును చోరీ చేసిన ఘటన బైటపడింది.

Written By Inamdar Paresh
Published: Oct 06, 2026, 08:39 AM IST | Updated: Oct 06, 2026, 08:49 AM IST
Image Credit: youtubermadhumitha(file)
Join

Case filed against Tamil nadu youtuber madhumitha: తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా స్టార్ మధుమిత  ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం తన ఇంట్లో కుప్పలు తెప్పలుగా డబ్బులు, బంగారం ఉందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్త నెట్టింట తెగ వైరల్గా  మారింది. అది కాస్త దొంగల కంట పడటంతో.. ఆ తర్వాత అనూహ్యంగా ఆమె ఇంట్లో చోరీ జరిగి ఏకంగా 118 సవర్ల బంగారంను, డబ్బులను దొంగలు ఎత్తుకుపోయినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి 98 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ఆమె ఆర్థిక లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ సైతం విచారణ చేపట్టింది.  ఈ వివాదం కొనసాగుతుండగానే ఆమె  ఒక  89 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తిరునెల్వేలి జిల్లా కేటీసీ నగర్‌కు చెందిన భవన నిర్మాణ కాంట్రాక్టర్ పేచ్చిముత్తు (89)కు నాగర్‌కోవిల్‌కు చెందిన యూట్యూబర్ మధుమితతో  మంచి పరిచయం ఉంది. ఈ క్రమంలో
2022లో ఒకరోజు ఆమె ఆయన వాహనంలో ప్రయాణించగా... పేచ్చిముత్తు ఆమెను బస్ స్టాప్‌లో దింపి ఇంటికి వెళ్లారు.

 ఆ తర్వాత పేచ్చిముత్తుతన మెడలో చూసుకొగా..  ఐదు సవర్ల గొలుసు మాయమైంది. దీనిపై ఆమెకు ఫోన్ చేసి ప్రశ్నించగా.. పోలీసులకు చెబితే పరువుతీస్తానని రివర్స్ లో భయపెట్టింది. ఈ క్రమంలో ఇటీవల పేచ్చిముత్తు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై  తిరునెల్వేలి పోలీసులు  కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 అయితే.. 89 ఏళ్ల వృద్ధుడిని హనీ ట్రాప్ చేసిందని ఈక్రమంలో ఆమె అతడికి మాయమాటలు చెప్పి చైన్ కొట్టేసినట్లు తెలుస్తొంది. మొత్తంగా మధుమిత మరికొంత మందిని సైతం హనీ ట్రాప్ చేసి అప్పుగా డబ్బులు, బంగారం తీసుకుని అడిగితే బెదిరింపులకు పాల్పడిందని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES