CM Yogi adityanath govt strictly implements new character verification rules: దేశ వ్యాప్తంగా ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా అనేక నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జెన్ జీలు నీట్ పేపన్ లీక్ పై నిరసనలు చేపట్టారు. పలు చోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీనికి జెన్ జీల నుంచి భారీ స్పందన వచ్చింది. కేంద్రంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు నిరసనలకు దిగారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నవంబర్ 1న నిరసనలకు పిలుపునిచ్చారు. దీనికి పార్టీలకు అతీతంగా ఈ నిరసన చేపడతున్నామన్నారు. దీనికి దేశ వ్యాప్తంగా యువతీ, యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తాజాగా.. తీసుకొచ్చిన నూతన మార్గదర్శకం కాస్త వార్తలలో నిలిచింది. ఉత్తర ప్రదేశ్ లో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకొచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగాలు కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల వెరిఫికేషన్ నిబంధనల్ని కఠినతరం చేశారు. అభ్యర్థులు గవర్నమెంట్ జాబ్ పొందిన తర్వాత స్థానికంగా పోలీసు వెరిఫికేషన్ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. యూపీలో కొత్త మార్గదర్శకాల ప్రకారం.. హింసాత్మక మార్గాల్లో అధికార మార్పిడి డిమాండ్ చేస్తున్న వారి గ్రూపుల్లో సభ్యులుగా ఉండటం, రాష్ట్రాన్ని అస్థిర పర్చాలని ఏకైక ఉద్దేష్యంతో నిరసనలు చేసే వారితో కలవడం చేస్తే అలాంటి వారిపై పోలీసులు ఇక నుంచి ఉక్కుపాదం మోపనున్నారు.
వీరు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత చిక్కుల్లో పడనున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం..ఈ కొత్త రూల్ యూపీ ప్రభుత్వ కొలువుల్లో, కార్పొరేషన్లు, మండలాలు, విద్యా సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, పంచాయతీలు, స్థానిక సంస్థలకు కూడా వర్తిస్తుందని సీఎం యోగి ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థికి 21 ఏళ్లు నిండిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం వెరిఫికేషన్‌కు ముందు మూడేళ్ల వ్యవధిలో , అదే విధంగా పోలీస్ నియామాకాల్లో ఉంటే ఐదేళ్ల పాటు ఏవైన క్రిమినల్ చర్యల్లో పాల్గొన్నారా అనివెరిఫికేషన్ చేస్తారు.
ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. అయితే.. కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన అభ్యర్థిని ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించరాదు. కేసుల్లో నిర్దోషిగా తేలినవారు, రాజీ ద్వారా పరిష్కారమైన కేసులు అనర్హత వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి వాటిపై స్థానిక పరిధిలోని జిల్లా కోర్టు నివేదికను ప్రామాణికంగా తీసుకొనున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకునే వారు జాగ్రత్తగా ఉండాలని యోగి ప్రభుత్వం సూచించింది. ఈ కొత్త రూల్ పై యోగి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ ఉత్తర్వులను సమాజ్‌వాదీ పార్టీ నేతలు బ్రిటిష్ పాలన కాలం నాటి విధానాలతో పోల్చారు.