Cockroach Janta Party: భారత ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల మధ్య విభేదాలపై కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలనే నినాదంతో ఉద్యమించింది.ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఢిల్లీకి సమాంతరంగా ఆర్థిక రాజధాని ముంబయిలోనూ ఆందోళన చేపట్టాలని సన్నద్ధమైంది. ఢిల్లీలో ఆందోళనకు అనుమతి లభించినప్పటికీ.. ముంబయిలో ఆందోళనకు అనుమతి ఇవ్వలేదు. ఢిల్లీ జంతర్ మంతర్ లో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు భారీగా మోహరించి, ఆందోళనకు తావులేకుండా నిరసన కారులను అడ్డుకున్నారు.
తప్పు దారి పట్టిన కాక్రోచ్ జనతా పార్టీ..
కాక్రోచ్ జనతాపార్టీ డిమాండ్ తో భారత ఎన్నికల సంఘ ముఖ్య నిర్వహణాధికారి జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా కు పట్టుపట్టారు. విద్యార్ధుల ఉద్యమం నుంచి రాజకీయ ఉద్యమం వైపు టర్న్ తీసుకుంది. ప్రజలు కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తోన్న పనులు అర్థమయ్యాయి. పంజాబ్ సహా కాంగ్రెస్ వారి మిత్ర పక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన అవినీతిని ప్రశ్నించని వీళ్లు.. కేవలం బీజేపీనే టార్గెట్ చేయడంతో ప్రజలు కూడా ఇది కేవలం బీజేపీ పార్టీని కావాలనే టార్గెట్ చేస్తోందన్న విషయం అర్దమైంది. దీంతో ఈ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్లే కరువయ్యారు. కాక్రోచ్ జనతాపార్టీ ఎలాంటి సంస్కరణలు కోరుకుంటోంది. భారత ఎన్నికల సంఘం చేసిన తప్పిదమేటి..? కేవలం ఓ పత్రికలో వాళ్లు ఊహించుకోని రాసిందానికి ప్రతిపక్షాలు నానా యాగి చేస్తున్నాయి. ఎన్నికల సంఘం చర్యలకు ఎవరు ఇబ్బంది పడ్డారు? ఓట్లు పోయాయన్న బాధితులు ఎవ్వరూ తమగోడు వెల్లబోసుకోడానికి ముందుకు రాలేదు. ఎన్నికల సంఘంలో అధికారుల విభేదాలను కారణంగా చూపించి మరోసారి పాపులర్ అయ్యేందుకు కాక్రోచ్ జనతాపార్టీ సన్నాహాలు చేసింది. దీనిపై కోర్టుకెళ్లినా.. అది వారికి సంబంధించిన అంశం. అందులో వారు తప్పులు చేసివుంటే మేము జోక్యం చేసుకుంటామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియపై అనవసరపు హంగామా..
ఒక పౌరుడు… ఒకే ఓటుహక్కు ఉండాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టింది. దీంతో ఓటరు జాబితా సవరణలో ఒకే రాష్ట్రంలో ఒక వ్యక్తికి నాలుగైదు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లు గుర్తించారు. ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తులు, వలసపోయిన వారి పేర్లు, ఇళ్లు మారి, కొత్త ఇంట్లోకి వెళ్లిన వారు ఓటు నమోదు చేసుకోవడంతో ఓటర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రతి రాష్ట్రంలో ఉండాల్సిన జనాభా, ఓటర్ల సంఖ్యకు పోల్చితే వ్యత్యాసం ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. ఓటరు జాబితాలో పేరు చేర్చుకునే సమయంలోనే వడపోత చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నికల సంఘం మార్పులు చేసింది. ఈ మార్పులపై ఎన్నికల సంఘ అధికారుల్లో భేదాభిప్రాయాలు వచ్చినట్లు కొన్ని పత్రికలు కావాలనే కొన్ని కథనాలు వండి వార్చాయి.
ఎన్నికల కమిషన్స్‌లో విభేదాలు..
అధికారుల విభేదాలను ఆసరాగా తీసుకున్న కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనకు దిగింది. ముంబై, ఢిల్లీలో ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతాపార్టీకి మద్ధతు కరువైంది. రాష్ట్రాల్లో ఎక్కడా కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనకు మద్ధతుగా నిరసన ప్రదర్శనలు లేకుండా పోయాయి. అధికారుల మధ్య బేదాభ్రిప్రాయాలున్నప్పటికీ.. ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు అమలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఓటరు జాబితా సవరణవల్ల ఎవరికి నష్టం వచ్చింది. పౌరులకు వచ్చిన ఇబ్బంది ఏంటనే ప్రశ్నలు కాక్రోచ్ జనతాపార్టీ సమాధానాలు చెప్పలేకపోతోంది.
కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళన వెనుక రాజకీయ శక్తులున్నాయా? రాజ్యాంగేతర శక్తులున్నాయా? అనే అంశంపై అధికార యంత్రాగం ఆరాతీస్తోంది. ఈ పార్టీ ఆందోళనల వెనక అమెరికాకు చెందిన సోరోస్ సంస్థతో పాటు చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీల మద్దతు ఉందనే వాదన ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రయోజన కరం కాదా? ఓటరు జాబితాలో పేరు నమోదుకు పౌరులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అనే అంశాలపై కాక్రోచ్ జనతాపార్టీ ప్రజల్లో అవగాహన కల్పించకుండా, ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామాకు డిమాండు చేయడాన్ని విద్యావంతులు, సామాజిక అవగాహన పరులు వ్యతిరేకిస్తున్నారు.
ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి..
భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిగల సంస్థ. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తరహాలో విధి విధానాలుంటాయి. నియామకం, తొలగింపు అషామాషీగా జరగదనే విషయం పౌరులు, విద్యావంతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘంపై రాజకీయ విమర్శలు, డిమాండ్లు భిన్నంగా ఉన్నప్పటికీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామాకు ఆస్కారం ఉండదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను తొగించాలని అభిశంసన నోటీసు ఇచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ ను తొలగించే సత్తా ఎవరికి ఉంది? ఆయన చేసిన తప్పేంటని అధికార పక్షనేతలు విపక్షాలపై మండిపడ్డారు.
సీఈసీ తెలిగించాలని ప్రతిపక్షాల డిమాండ్..
దేశంలో తొలిసారిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను తొలగించాలని రాజకీయ పక్షాలనుంచి డిమాండు వెలుగులోకి వచ్చింది. ఓటరు జాబితా సమగ్ర సవరణతో ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో ఇద్దరు కమిషర్ల అభిప్రాయాలతో ఇపుడు విమర్శలు ఎదుర్కొంటోంది. రాజకీయ నాయకులు ఉత్తుత్తి ఆరోపణలతో రాజీనామా డిమాండ్ల సరికావని అధికార పక్ష నాయకులు అంటున్నారు. రాజకీయ నాయకుల డిమాండ్లతో చీఫ్ ఎలక్షన్ కమిషర్ రాజీనామా చేయాల్సిన అవసరమేలేదని స్పష్టంచేశారు.
సమాజంకోసం ఏదో చేయాలనే తపనతో పనిచేసే వాళ్లు వేరు.. సమాజంలో పాపులారిటీ తెచ్చుకోవాలని ప్రయత్నించేవాళ్లు మరికొందరున్నారు. సమాజంకోసం పాటుపడేవారికి గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని స్వల్ఫకాల వ్యవధిలోనే పాపులారిటీకోసం ఇపుడు సోషల్ మీడియా వేదికగా మారింది. సమాజాన్ని సోషల్ మీడియా ఏం చేస్తోంది? ప్రజలకు నాలెడ్జిని పెంపొందిస్తుందా? సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నిస్తోందా? అనే ప్రశ్నలకు విభిన్న సమాధానాలున్నాయి.
కాక్రోచ్ జనతా పార్టీ..
అది 2026 మే 15న తేదీ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంలో నిరుద్యోగ యువతను,ఉద్యమకారులను ఉద్దేశించి బొద్ధింకల్లా తయారయ్యారని విచారం వ్యక్తంచేశారు. సమాజానికి పరాన్నాజీవుల్లా తయారయ్యారని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల పాజిటివ్ గా తీసుకుని సమాజానికి పరాన్నా జీవులంకాదు.. సమాజ ప్రయోజకులుగా మారుదామనే భావనతో సరికొత్త ఆలోచన చేయాల్సిన యువత… సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఆవేశంతో ఊగిపోయిన అభిజీత్ దీప్కే కాక్రోచ్ జనతాపార్టీని ఆ మరుసటిరోజు 2026 మే 16తేదీన వెలుగులోకి తెచ్చారు.
కాక్రోచ్ జనతాపార్టీ నిజమైన రాజకీయ పార్టీకాదు. దాని జెండా వేరు, అజెండా వేరు, లక్ష్యం వేరు. ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా స్ట్రాటజిస్టుగా పనిచేసిన అభిజీత్ దీప్కే.. కాక్రోచ్ జనతాపార్టీ సృష్టికర్త. భారతీయ జనతా పార్టీని వ్యగ్యంగా పలుకరించేందుకు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతాపార్టీ పేజీని అభిజీత్ నిర్వహించేవారు. బీజేపీ నాయకులను, రాజకీయాలను వ్యంగ్యాస్త్రాలతో కాక్రోచ్ జనతాపార్టీపేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఆమ్ ఆద్మీపార్టీ సోషల్ మీడియా నుంచి అభిజీత్ దీప్కే సమయంకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ పార్టీనుంచి బయటకు వచ్చిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీని దేశ వ్యాప్త పాపులారిటీ కోసం వెలుగులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పేరును వినిపించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు కారణమయ్యాయి.
నీట్ పరీక్ష రద్దుతో సీజేపీకి బలం చేకూరింది...
మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశంకోసం నిర్వహించిన నీట్ 2026 ను రద్దు ప్రకటన విద్యార్థులను ఖంగు తినిపించింది. అపుడే పరీక్ష రాసి ఫలితాలకోసం ఎదురుచూస్తున్న 20లక్షల ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆలోచనలో పడ్డారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్ 2026 పరీక్ష రాసిన విద్యాక్థులకు గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా మే 3వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్‌లోని సికార్ వేదికగా జరిగిన ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా పాపులారిటీ కోసం ఎదురుచూస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి నీట్ పరీక్ష రద్దు ఆయుధమైంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం బుల్లెట్ లా పనిచేసింది. నీట్ పరీక్షను ఎవ్వరూ రద్దుచేయమని డిమాండ్ చేయలేదు. బిహార్ లోని పాట్నా, నలంద, జార్ఖండ్ లోని హజారీబాగ్, మహారాష్ట్రలోని నాసిక్, పుణె, లాతూర్, రాజస్థాన్ లోని సికార్, జైపూర్, హర్యానాలోని గురుగ్రామ్, గుజరాత్ లోని గోధ్రా ప్రాంతాల్లో సర్క్యులేట్ అయిన మోడల్ ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలు, నీట్ ప్రశ్నాపత్రంలో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నీట్ 2026ను రద్దు చేశారు.
నీట్ పరీక్ష రద్దుచేసిన తర్వాత కాక్రోచ్ జనతాపార్టీ రంగంలోకి దిగింది. సోషల్ మీడియా వేదికగా విద్యార్థులపట్ల, వారి తల్లిదండ్రుల పట్ల సానుభూతి ప్రకటించింది. ప్రశ్నాపత్రం ఎలా లీకైంది? ఎవరి తప్పిదం? మోడల్ ప్రశ్నాపత్రాలతో ఎన్నికోట్ల లావాదేవీలు జరిగాయి? ఈ మోడల్ ప్రశ్నలు ఎలా సర్క్యులేట్ చేశారు? వ్యవస్థీకృత లోపం ఎక్కడ? ఇది విద్యార్థులకు ఎలా శాపంగా మారింది? ఇలాంటి పరిణామాలు ఎవరి ద్వారా ఉత్పన్నమవుతున్నాయనే విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన తరుణంలో కాక్రోచ్ జనతాపార్టీ వారిని రెచ్చగొట్టి ఉద్యమానికి ఉసిగొల్పింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు ఎక్కడా వినిపించ లేదు. కేసులు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు పరీక్షను రద్దుచేశారు.
విద్యాశాఖ మంత్రి రాజీనామా ఎజెండాగా కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా..
కాక్రోచ్ జనతాపార్టీ పంధా మార్చింది. నీట్ పరీక్ష నిర్వహించిన తర్వాత… విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని సీజేపీ కొత్తనినాదాన్ని తెరపైకి తెచ్చింది. నీట్ పరీక్ష ప్రశ్రాపత్రం లీక్ కు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండుతో విద్యార్థులతో ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆందోళన చేపట్టింది. అన్ని రాష్ట్రాల్లోనూ సీజేపీ ఆందోళనకు మద్ధతు లభించింది. ఊహించని విధంగా కాక్రోచ్ పార్టీకి పాపులారీటీ పెరిగింది.
మచ్చలేని రాజకీయ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్..
ప్రశ్నా పత్రం లీక్ కు కారకులపై పోలీసులు, ధర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి ధర్యాప్తు చేశాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయినా విద్య సంస్కరణలు చేపట్టాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరిగింది. ఢిల్లీలోనే కాదు… రాష్ట్రాల్లోనూ ఆందోళనలు వెల్లువెత్తాయి. ధర్మేంధ్ర ప్రధాన్ విధిలేని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సంచలనంగా మారింది. మచ్చలేని రాజకీయ నాయకుడిగా రాణించి, విద్యా సంస్కరణలకు కారకుడైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా కాక్రోచ్ జనతాపార్టీ రాజీనామా చేయించిందనే పేరు మారుమోగింది. దేశంలో అనవసరపు రాద్ధాంతం జరుగుతోందని, ఆందోళనల ముసుగులో అరాచకాలు పెచ్చరిల్ల కూడదనే భావనతో రాజీనామా చేశానని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. పదవీకాంక్షలేదని స్పష్టంచేశారు.అయితే వీటి వెనక ఎఫ్ఆర్‌సీఏ చట్టం ఉందనే విషయం తేటతెల్లమైంది.
సందర్భం ఏదైనా సరే పాపులారిటీ సాధించాలని కాక్రోచ్ పార్టీ పరితపిస్తోంది. క్షణికావేశంతో పుట్టిన కాక్రోచ్ జనతాపార్టీ ప్రతి సందర్భాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో మొన్న నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్, తాజాగా ఎన్నికల సంఘం అధికారు విభేదాలపై ఆందోళనకు పిలుపునిచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు పెద్దగా మద్దతు కరువైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు… కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేస్తారని రోడ్డెక్కాయి. ఇక్కడ ప్రజల అసలు విషయాన్ని గ్రహించడంతో వీరి పన్నాగం బట్ట బయలైంది.