Condom Sales Row: దాండియా ముసుగులో రొమాన్స్... ఏకంగా 50 శాతం పెరిగిన కండోమ్ల అమ్మకాలు.?. నెట్టింట రచ్చ...
Gujarat dandiya row: కొంత మంది దాండియా ముసుగులో పాడుపనులకు తెరతీశారని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గుజరాత్ లో గర్బా వివాదం వార్తలలో నిలిచింది.
Condom sales hike in Gujarat amid Navratri dandiya claim: దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలను ప్రజలంతా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతిరోజు రాత్రివేళ ప్రజలు ఎంతో భక్తి భావనలతో దాండియా ఆడతారు. ముఖ్యంగా నార్త్ రాష్ట్రాల్లో గర్బాను ఎంతోగ్రాండ్ గా నిర్వహిస్తారు. దీని కోసం అనేక ఈవెంట్ ఆర్గనైజర్ లు సైతం ప్రత్యేకంగా దాండియాను ఏర్పాటు చేశాయి. దాండియా కోసం ప్రత్యేకంగా టెంట్ లు, డీజేలను ఏర్పాటు చేస్తున్నాయి. గర్బా ఆర్గనైజర్ లు దీని కోసం డబ్బులను కూడా కలెక్ట్ చేస్తున్నారు.
దాండియా ముసుగులో కొంత మంది యువతీ, యువకులు పాడుపనులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా గర్బాలో యువకులను వల్లో వేసుకొవడానికి అమ్మాయిలను కూడా రంగంలోకి దించారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి వరకు అశ్లీలంగా దుస్తులు ధరించి దాండియా ఆడుతున్నారు.
దీన్ని ఆసరగా చేసుకుని కొంత మంది ఈవెంట్ నిర్వాహకులు ప్రత్యేక రూమ్ లను సైతం ఏర్పాటు చేసి రొమాన్స్ లకు తెరతీసినట్లు సమాచారం. ఇదే క్రమంలో కండోమ్ ల అమ్మకాలు ఏకంగా 50 శాతం పెరిగినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. మహిళ పోలీసులు సైతం మఫ్టీలో గర్బా ఆడుతున్న వారిలో చేరి నిర్వాహకులపై నిఘా పెట్టారు.
అయితే.. గర్భాముసుగులో ఇలాంటి పాడుపనులు ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. కొంత మంది కావాలని హిందూ ధర్మంను టార్గెట్ చేసుకుని ఈ విధంగా కొన్ని అసత్య ప్రచారాలు కూడా తెరమీదకు తెచ్చారని ఈ ప్రచారంను ఖండిస్తున్నారు. మొత్తంగా ఈ గర్బావేళ కండోమ్ అమ్మకాల రచ్చ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.