SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

DA July Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లోకి డీఏ జమ..63 శాతం పెంపుతో 4 నెలల బకాయిలు విడుదల!

DA July Hike Credited News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట కలిగిస్తూ కరవు భత్యం (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)లను 60 శాతం నుండి 63 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 3 శాతం పెంపుదల 2026 జూలై 1 నుంచి అమల్లోకి రావడంతో, ఉద్యోగులకు జూలై నుంచి అక్టోబర్ వరకు నాలుగు నెలల డీఏ బకాయిలు (ఎరియర్స్) అందుతాయి. ఈ నిర్ణయం వల్ల సుమారు 48.54 లక్షల మంది ఉద్యోగులకు, 68.71 లక్షల మంది పెన్షనర్లకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది.

Written By Harish Darla
Published: Oct 30, 2026, 06:23 PM IST | Updated: Oct 30, 2026, 06:27 PM IST
Join

DA July Hike Credited News: పెరుగుతున్న ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించేందుకు 7వ వేతన సంఘం (7th CPC) సిఫార్సులు, లెక్కింపు విధానం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏను సవరించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల నెలవారీ వేతనంలో మూల వేతనం (బేసిక్ పే) ఆధారంగా అదనపు ఆదాయం తోడవుతుంది.

వివిధ బేసిక్ శాలరీల ఆధారంగా పెరిగే డీఏ, 4 నెలల ఎరియర్స్ వివరాలు ఇలా ఉన్నాయి. 
రూ. 18,000 బేసిక్ శాలరీ ఉన్న వారికి గతంలో 60% డీఏతో రూ. 10,800 రాగా, 63% పెంపుతో ఇది రూ. 11,340కి పెరుగుతుంది. దీనివల్ల నెలకు రూ. 540 అదనంగా రాగా, 4 నెలల బకాయిల రూపంలో రూ. 2,160 అందుతాయి.

రూ. 25,500 బేసిక్ శాలరీ ఉన్న వారికీ.. 60% డీఏతో రూ. 15,300 లభించగా, 63% డీఏతో అది రూ. 16,065కి పెరుగుతుంది. నెలకు రూ. 765 అదనపు లబ్ధితో పాటు, 4 నెలల బకాయిలు రూ. 3,060 అకౌంట్లో జమ కానున్నాయి.

రూ. 29,200 మూల వేతనం కలిగిన ఉద్యోగులకు గతంలో రూ. 17,520 ఉండగా, నూతన పెంపుతో రూ. 18,396 లభిస్తుంది. నెలకు రూ. 876 అదనంగా రానుండగా.. 4 నెలల బకాయిలు రూ. 3,504 డబ్బు చేతికి అందనుంది.

రూ. 44,900 మూల వేతనం కలిగిన ఉద్యోగులకు 60% డీఏతో రూ. 26,940 రానుంది. 63% పెంపుతో అది రూ. 28,287కి కొత్త డీఏ చేరుతుంది. నెలకు రూ. 1,347 అదనపు లబ్ధితో పాటు 4 నెలల బకాయిలు రూ. 5,388 చేతికి అందనున్నాయి.

అలాగే రూ. 56,100 బేసిక్ శాలరీ కలిగిన ఉద్యోగులకు గతంలో రూ. 33,660 రాగా.. ఈ సరికొత్త డీఏ పెంపు 63 శాతంతో రూ. 35,343 లభించనుంది. ఈ విధంగా నెలకు రూ. 1,683 అదనంగా రాగా, 4 నెలల బకాయిలుగా రూ. 6,732 ఉద్యోగికి అందనున్నాయి.

మూల వేతనాన్ని బట్టి ఉద్యోగులకు అందే బకాయిలు రూ. 2,160 నుండి రూ. 6,732 వరకు ఉంటాయి. ఇవి కేవలం డీఏ పెంపు అంచనా లెక్కలని, పేరోల్ సర్దుబాట్లను బట్టి చేతికి అందే మొత్తం మారవచ్చని గమనించాలి. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 10,016.10 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపుతో సమానంగా ప్రయోజనం చేకూరుతోంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES