SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Haryana: కూతురి కాళ్లపై పడి వేడుకుంటున్న తండ్రి.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. అసలు విషయం ఏమిటంటే..?..

Woman love affair dispute in haryana: తండ్రి కూతురి కాళ్లపై పడి ఎంతో దీనంగా వేడుకుంటున్నాడు. అయిన కూడా ఆమె ఏ మాత్రం లెక్క చేయడంలేదు. హర్యానాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 04, 2026, 08:43 AM IST | Updated: Oct 04, 2026, 08:54 AM IST
Image Credit: lovetragedyinharyanavideo
Join

Father falls on daughter feet over love marriage dispute in Haryana: సమాజంలో అసలు మానవ  సంబంధాలు ఉన్నాయా.?.. అన్న అనుమానం కల్గుతుంది. కొంత మంది మనుషులు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. కన్న వాళ్లను, రక్త సంబంధాలను కూడా లెక్కచేయడంలేదు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని పట్టించుకొవడంలేదు. పుట్టినప్పటి నుంచి గుండెల మీద ఎత్తుకుని పెంచుకుంటూ అడిగిందిన కాదని ప్రతిది తెచ్చిపెట్టిన తండ్రిని కూడా వదలడంలేదు. కేవలం డబ్బుల కోసం మాత్రమే అన్నట్లు కొంత మంది ప్రవర్తన ఉంటుంది. 

 

 

 

ఈ క్రమంలో చాలా మంది ఇటీవల ప్రేమ వివాహాలకు మాత్రమే ఇష్టపడుతున్నారు. పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహలు చేసుకుంటున్నారు. అంతే కాకుండా తమకు ప్రాణహనీ ఉందని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పీఎస్ లకు వచ్చి కాళ్ల మీద పడ్డ కూడా కన్న వారిని పట్టించుకొవడంలేదు. ఈ కోవకు చెందిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. అది కాస్త వైరల్గా మారింది.

హర్యానాలో ఒక జంట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ  ఆ పెళ్లి ఇంట్లో వారికి ఇష్టంలేదు. తమ కూతురుకు ఎంతగా చెప్పిన ఆమె ప్రియుడితో వెళ్లిపోయేందుకు రెడీ అయ్యింది. పాపం.. ఆ తండ్రి కూతురికి వెళ్లవద్దని  కాళ్ల మీద పడి వేడుకుంటున్నాడు.అయిన ఆమె ఎక్కడ తగ్గడంలేదు. 

కింద కూర్చుని చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్న ఆమె కనికరం చూపలేదు.  తండ్రి ఎంతగానో నచ్చప్పాడు కానీ కూతురు తిరస్కరించి ప్రియుడితోనే వెళ్లిపోయింది. వేలు పట్టుకుని నడక నేర్పిన కూతురే ఇలా చేయడంతో తండ్రి గుండెలు పగిలేలా రోదించాడు.

 ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు కొంత మంది యువతికి సపోర్ట్ చేస్తుండగా మరికొంత మంది మాత్రం తండ్రికి తమ మద్దతు తెలియజేస్తున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES