• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ప్రకృతి ప్రకోపం.. ప్రపంచానికి ‘ఎల్ నినో’ ముప్పు..!

ప్రకృతి ప్రకోపం.. ప్రపంచానికి ‘ఎల్ నినో’ ముప్పు..!

Global Warming: గ్లోబల్ వార్మింగ్ టెర్రర్ పుట్టిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు ప్రకోపిస్తున్నాయి. ప్రపంచంలో ముప్పు ముంచు కొస్తోంది. మొన్న కనిపించని భూతం ప్రపంచాన్ని వణికించింది. ఇపుడు కనిపించే పరిస్థితులు ప్రజానీకాన్ని హెచ్చరిస్తున్నాయి. కోవిడ్ వైరస్ వణికిస్తే … ఇపుడు ఎల్ నినో బెంబేలెత్తిస్తోంది. ప్రకృతి వైపరీత్యం మానవ ప్రాణాలను బలిగొంటుందా? ఎల్ నినోకు ప్రపంచం భయపడుతోందా? శాస్త్రవేత్తలు భయపెడుతున్నారా? మానవాళిపై ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుంది? జీ తెలుగు స్పెషల్..

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 30, 2026, 06:25 AM IST|Updated: Oct 30, 2026, 06:26 AM IST
joinshare
ప్రకృతి ప్రకోపం.. ప్రపంచానికి ‘ఎల్ నినో’ ముప్పు..!
Image Credit: El Nino Effect (AI Generated Pic/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు వాయుగుండంగా బలపడే అవకాశం..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు వాయుగుండంగా బలపడే అవకాశం..

2

నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు..

3

డంపింగ్ యార్డ్ శాపం.. పీల్చే గాలి కాలుష్యం... తాగే నీరు విషం.! జవహర్ నగర్ ఆక్రోశం..!

4

ప్రకృతి ప్రకోపం.. ప్రపంచానికి ‘ఎల్ నినో’ ముప్పు..!

5

తెలంగాణలో రికార్డు స్థాయిలో సన్నవడ్ల సాగు.. గిట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో మోసపోతున్న రైతన్నలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

El Nino Effect: వాతావరణ పరిస్థితులు మానవ ప్రాణాలపై పాశుపతాస్త్రాన్ని సంధించ బోతోందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.  నిన్నమొన్నటిదాకా వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఆసక్తిరేకెత్తించే అంశాలను వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదవుతున్నాయి.

సూపర్ ఎల్‌ నినోతో తీవ్ర ప్రభావం..

వాతావరణ పరిస్థితులతో తలెత్తిన  సూపర్ ఎల్ నినో  తీవ్ర ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వల్ల ప్రపంచ వ్యాప్తంగా  భారీ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు లెక్కలు గట్టిన తీరుతో ఆందోళనకర విషయాలు వెలుగు చూశాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో మానవ ప్రాణాలు విలవిల్లాడే పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్  రూపొందించిన సరికొత్త 'ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్' నివేదిక ప్రకారం అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. రాబోయే ఆరు నెలల వ్యవధిలో ప్రపంచంలో పెరిగే ఉష్ణోగ్రతలతో సాధారణ మరణాలకంటే మూడు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.

భారత్ పై ఎల్‌ నినో ప్రభావం..

భారత దేశంలో ఎల్ నినో ప్రభావంతో సాధారణ మరణాలతో సంబంధం లేకుండా… పెరిగిన ఉష్ణోగ్రతలతో చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతను తట్టుకునే పరిస్థితి లేక మృత్యువాత పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఇండోనేషియా, సూడాన్, బ్రెజిల్ వంటి దేశాలు మృత్యువాత పడే అంచనా జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి.

రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావంతో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు భూమిపై ఉష్ణోగ్రత ప్రభావంతో ఉక్కపోతకు దారి తీస్తుంది.  ఎల్ నినో వల్ల భూమిపై ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది విపరీతమైన ఉష్ణోగ్రతలకు దారితీస్తుంది.

వృద్దులు, చిన్నారులపై తీవ్ర ప్రభావం.. 
వాతావరణ మార్పులతో వడగాల్పుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులపై వడదెబ్బ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బీపీ, షుగర్ తో బాధపడుతున్న వారిపై మరింత ప్రభావితం చూపే అవకాశాలున్నాయిన వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె పోటు, కిడ్నీ వైఫల్యం, శ్వాసకోశ వ్యాధులు తీవ్రమై ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశాలుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఎల్‌నినోతో వర్షపాతం లోటు..

ఎల్ నినో ప్రభావంతో ఋతుపవనాలు బలహీనపడి వర్షపాతం లోటు ఏర్పడుతుందని వాతావరణ అధ్యయనశాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో తాగునీరు, సాగునీటికి తీవ్రమైన కొరత ఉంటుంది. పంటల దిగుబడి లేక కరువు పరిస్థితులు గోచరిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆహారధాన్యాలకు విపరీతమైన డిమాండుతో రేట్లు అమాంతంగా పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో బియ్యం ధరలను అమాంతంగా పెంచేశారు. పెరిగిన ధాన్యం ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాబోయే రోజుల్లో కూరగాయలు, ఆకుకూరల దిగుబడి తగ్గి డిమాండుకు తగ్గట్లు సరఫరా చేయలేని పరిస్థితులుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

పేద వర్గాలపై తీవ్ర ప్రభావం.. 
ముఖ్యంగా ఇప్పటికే వేడిగా ఉండే ప్రాంతాలు, ఎయిర్ కండిషనింగ్  సదుపాయాలు,  సరైన వైద్య సదుపాయాలు లేని పేద వర్గాల ప్రజలపై ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాలని, చల్లదన కేంద్రాలను  ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

గ్లోబల్ సౌత్‌ దేశాల్లో విపరీతమైన వడగాలులు, వేడి సంబంధిత మరణాలు ఎక్కువగా ఉండొచ్చని మోర్టాలిటీ ట్రాకర్ నివేదిక హెచ్చరించింది. భారత్‌పై కూడా ఎల్‌నినో  ప్రభావం గట్టిగానే ఉంటుందని, అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో 55వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. అత్యధిక మరణాలు మార్చి నెలలోనే నమోదు కావొచ్చని వెల్లడించింది. నైజీరియాలో 56వేలు, ఇండోనేషియాలో 29వేలు, బ్రెజిల్‌లో 19వేల చొప్పున మరణాలు ఉండొచ్చని పేర్కొంది. 1950 తర్వాత ఈసారే అత్యంత బలమైన ఎల్‌నినో ఏర్పడిందని, దీని ప్రభావం 2027లోనూ కొనసాగుతుందని  ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది.

(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Weather Update
World News
National News