• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు వాయుగుండంగా బలపడే అవకాశం..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు వాయుగుండంగా బలపడే అవకాశం..

low pressure in the Bay of Bengal sea : బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 30, 2026, 07:25 AM IST|Updated: Oct 30, 2026, 07:28 AM IST
joinshare
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు వాయుగుండంగా బలపడే అవకాశం..
Image Credit: Low Pressure in Bay Of Bengal (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Adarsha Kutumbam Twitter Review: ఆదర్శ కుటుంబం మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది.. పబ్లిక్ టాక్ ఇదే..!

Adarsha Kutumbam Twitter Review: ఆదర్శ కుటుంబం మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది.. పబ్లిక్ టాక్ ఇదే..!

2

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు వాయుగుండంగా బలపడే అవకాశం..

3

నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు..

4

డంపింగ్ యార్డ్ శాపం.. పీల్చే గాలి కాలుష్యం... తాగే నీరు విషం.! జవహర్ నగర్ ఆక్రోశం..!

5

ప్రకృతి ప్రకోపం.. ప్రపంచానికి ‘ఎల్ నినో’ ముప్పు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Heavy Rains: ఏపీకి అర్నబ్ తుపాను ముప్పు తప్పింది. మరోవైపు మురోసు తుపాను రాబోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ రేపు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయిని భారత వాతావరణ శాఖ తెలిపింది.

సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం..
తర్వాత రానున్న రెండు రోజుల్లో మరింత బలపడి, పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.  ఇది తుపానుగా మారుతుందా అనేదానిపై రానున్న రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. మరోవైపు, ఇటీవల ప్రభావం చూపిన 'అర్నబ్' తుపాను వాయుగుండంగా మారి, ఉత్తర ఛత్తీస్‌గఢ్ - వాయవ్య ఒడిశా వైపు పయనించి క్రమంగా అల్పపీడనంగా బలహీనపడింది.

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తాజా వాతావరణ మార్పుల ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా కంచిలిలో అత్యధికంగా 24.8 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
Weather Update
Telangana Weather
Andhra Pradesh
AP News