SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttarakhand Chopper Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలీన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు.. సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్బ్రాంతి..

chamoli helicopter missing: బద్రీనాథ్ నుంచి డెహ్రడూన్ కు బయలుదేరిన హెలికాప్టర్ ప్రమాదంకు గురైంది. హెలికాప్టర్ లో ప్రమాద సమయంలో పైలెట్ గా సహా ఆరుగురు ఉన్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 30, 2026, 03:03 PM IST | Updated: Oct 30, 2026, 03:28 PM IST
Image Credit: uttarakhand helicopter crash
Join

Helicopter returning from badrinath dham missing: ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ గల్లంతయ్యింది. జోషిమఠ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే.. బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా  ఉత్తరాఖండ్ లోని జోషిమట్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయంలో హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణికులతో పాటు ఒక పైలట్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  ఈ ఘటన మధ్యాహ్నం 2:15 గంటలకు చోటు చేసుకుందని, భారీగా మంచు కురుస్తున్న సమయంలోనే టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

 

 

హెలికాప్టర్ కు  ప్రమాదం తర్వాత ఎవియేషన్ సిబ్బందితో సంబంధాలు తెగిపొవడంతో అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విమానం ఆకాశంలో చక్కర్లు కొడుతున్న వీడియో వైరల్గా మారింది. మరోవైపు జోషిమఠ్ లోని చాయ్ గ్రామం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిందని చెబుతున్నారు.  అక్కడ దట్టంగా పొగలు వ్యాపించాయని  స్థానికులు చెబుతున్నారు. దీంతో జిల్లా యంత్రాగంతో పాటు, విపత్తు నిర్వాహణ అధికారులు,ఎస్టీ ఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వెంటనే ఆ ప్రాంతంలోకి అంబులెన్స్ లను తరలించారు.

సీఎం పుష్కర్ సింద్ ధామి తీవ్ర దిగ్బ్రాంతి..

హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఉత్తరఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని శాఖలకు చెందిన అధికారులు ఘటన ప్రదేశంకు చేరుకున్నారని అన్నారు. ప్రయాణికులు క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES