SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttar Pradesh: ప్రియుడితో భార్య జంప్.. గుడిలో పెళ్లి చేసి, వీడ్కొలు పలికిన భర్త.. యూపీలో విచిత్ర ఘటన.!.

Sitapur husband news: తన 17 ఏళ్ల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పుకుని ఆమె ప్రియుడితో గ్రాండ్ గా పెళ్లి చేశాడు. డైవర్స్ కూడా తీసుకుని ఆమె సంతోషంగా ఉండటమే తనకు కావాలని చెప్పాడు. యూపీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 19, 2026, 05:59 PM IST | Updated: Oct 19, 2026, 06:20 PM IST
Image Credit: up sitapur husband marriage news
Join

Husband breaks his 17 years relation in uttar Pradesh: ఇటీవల సమాజంలో కొంత మంది భార్యభర్తలు పెళ్లి అనే పవిత్ర బంధానికి మాయని మచ్చగా మారుతున్నారు. వివాహేతర సంబంధాల్లో పడి దారుణాలు చేస్తున్నారు. వారి కామవాంఛలకు అడ్డుపడితే కట్టుకున్న వారినే కాటికి పంపుతున్నారు.ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. అయితే.. కొంతమంది భర్తలు ముందు జాగ్రత్తగా తమ భార్యకు ఎఫైర్ ఉందని తెలిస్తే వారికి చక్కగా పెళ్లిళ్లు చేసి మరీ డైవర్స్ తీసుకుని బతికి పొతున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.

 

 

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. విపిన్, రేఖలకు  2009 లో పెళ్లి జరిగింది. ఆతర్వాత ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు.  వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. ఇటీవల రేఖకు సోషల్ మీడియాలో రాహుల్ కుమార్ ఉపాధ్యాయ్‌ అనే వ్కక్తి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. తరచుగా భర్తకు తెలియకుండా మాట్లాడుకునే వారు. 

కొన్ని రోజుల క్రితం మహిళ ఇంట్లో నుంచి కన్పించకుండా పోయింది. భర్త విపిన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆతర్వాత రేఖ వచ్చి తనకు భర్తతో డైవర్స్ కావాలని, ప్రియుడితో ఉంటానని పోలీసులకు చెప్పింది. స్థానికులు, పోలీసులు ఎంత నచ్చచెప్పిన ఆమె విన్పించుకోలేదు. దీంతో భర్త విపిన్ మాత్రం తన భార్య సంతోషాన్ని కాదనకుండా ఆమెతో డైవర్స్ తీసుకున్నాడు. 

స్వయంగా ఆలయంలో అందరి ఎదుట  తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి కూడా జరిపించాడు. ఆతర్వాత స్వయంగా వారిని ఢిల్లీకి సాగనంపాడు.  ఈ ఘటనపై స్థానికులు విపిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్ లు దీనిపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES