SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఇవి బంద్!

రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్‌.. ఇకపై మీ ఇష్టానుసారంగా ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు ఛార్జింజ్‌ పెట్టే అవకాశం లేదు. కేవలం నిర్దిష్ట సమయంలోనే రైల్వే ప్రయాణం చేస్తున్నప్పుడు ఛార్జింగ్‌ పాయింట్లకు పవర్‌ సప్లై ఉండనుంది. అంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్‌ పాయింట్లకు పవర్‌ సప్లై నిలిచిపోనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 28, 2026, 12:43 PM IST | Updated: Oct 28, 2026, 12:48 PM IST
Image Credit: Indian Railways new charging rules: File
Join

Indian Railways new charging rules: భారతీయ రైల్వే నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. మీరు కూడా త్వరలో రైల్వే ప్రయాణం చేయనున్నారా? అయితే, ఈ విషయం ముందుగా తెలుసుకోండి.. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఎప్పటికప్పుడు భారతీయ రైల్వే మార్పులను చేస్తుంది. తాజాగా ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ పాయింట్లకు సంబంధించి కూడా కొత్త మార్పు చేసింది. అయితే, ఇది 2014 నుంచి ఉన్న ప్రతిపాదనే అయినా.. సరిగ్గా అమలు కాలేదు. ఇప్పటి నుంచి రైల్వే బోర్డు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొబైల్‌, ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ అవకాశం ఉండు. వాటికి పవర్‌ సప్లై నిలివేయాలని అన్ని రైల్వేజోన్లకు భారతీయ రైల్వే ఆదేశించింది. ఇందులో ఎలాంటి మినహాయింపు కూడా ఉండదు. ఎందుకంటే ఇటీవలె సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో ఛార్జింగ్‌ సమయంలో పవర్‌ బ్యాంక్‌ పేలి పొగలు వచ్చాయి. దీంతో ఈ కఠిన చర్యలకు చేపట్టింది ఇండియన్‌ రైల్వే.

అంతేకాదు, చాలామంది ప్రయాణీకులు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి అలాగే వదిలేస్తుంటారు. దీంతో ఇది రాత్రంతా ఛార్జింగ్ అవుతుంది. అధిక టెంపరేచర్‌లో ఇవి పేలి పోతున్నాయి.. రైలు ప్రయాణీకుల భద్రతా దృష్ట్యా రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 17 జోన్‌లకు కూడా రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఇది స్లీపర్‌, 3 ఏసీ, 2 ఏసీ, 1 ఏసీ అని తరగతులకు వర్తిస్తుంది. ఇక సమయానికి రైల్వే సిబ్బంది కూడా పవర్‌ సప్లై నిలిపివేయడానికి రైల్వే రక్షణ దళం, విద్యుత్‌ శాఖ ఆకస్మిక తనిఖీ కూడా నిర్వహించనున్నారు.

Read Also: తుఫాన్‌ ఎఫెక్ట్‌.. మరో 11 రైళ్లు కేన్సల్‌..! ‘అర్నాబ్’ ప్రభావంతో రైల్వే శాఖ నిర్ణయం!


Read Also: రైల్వేలో భారీ నోటిఫికేషన్ విడుదల.. 5,236 NTPC ఉద్యోగాలు, డిగ్రీ, ఇంటర్ అర్హతతో భర్తీ! పరీక్ష విధానంలో కీలక మార్పులు ఇవే!
 

భారతీయ రైల్వే 2014లోనే రాత్రి పూట రైళ్లలో ఛార్జింగ్‌ పాయింట్లకు పవర్‌ సప్లై నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2021లో కఠినంగా అమలు చేస్తామని కూడా రైల్వే తెలిపింది. అయితే, ప్రస్తుతం ఈ నియమాలను అమలు చేయనున్నారు. ప్రధానంగా ఏసీ క్లాసుల్లో ఆకస్మిక ప్రమాదాలు కూడా జరగకుండా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పై మీరు రైలు ప్రయాణం చేస్తున్నట్లయితే  రాత్రి 11 గంటలలోపే ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు ఛార్జింగ్‌ పెట్టండి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక ఉదయం 5 గంటల వరకు పవర్‌ సప్లై ఉండదు. ఎప్పటికప్పుడు భారతయ రైల్వే ప్రయాణీకుల భద్రత, సులభతర ప్రయాణం కోసం మార్పులు చేస్తూనే ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES