Cyclone Arnab Effect 11 More Trains Cancelled: తుఫాన్ ఎఫెక్ట్ నిన్న పలు రైళ్లు రద్దైన సంగతి తెలిసిందే.. తాజాగా అర్నాబ్ ఎఫెక్ట్ వల్ల ఏపీ మీదుగా వెళ్లే మరో 11 రైళ్లను కూడా కేన్సల్ చేశారు. మీరు కూడా రైలు బుక్ చేసుకున్నట్లయితే ఈ లిస్ట్ చెక్ చేయండి..
1/5
రైళ్ల రద్దు అలర్ట్
అర్నాబ్ ఎఫెక్ట్ వల్ల పలు రైళ్లను రద్దు చేస్తోంది భారతీయ రైల్వే.. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేస్తోన్న రైల్వే మరో 11 రైళ్లను కూడా ఈరోజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతా దృష్ట్యా భారతీయ రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
2/5
భారతీయ రైల్వే
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవి అక్టోబర్ 27, 28 తేదీల్లో ప్రయాణం చేయాల్సి ఉంది. మొత్తం 53 రైలు సర్వీసులను తుఫాన్ నేపథ్యంలో కేన్సల్ చేశారు. తాజాగా ఈరోజు కూడా రేపు నడవాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
3/5
దక్షిణ మధ్య రైల్వే
మీరు కూడా రైలు ప్రయాణం చేస్తున్నట్లయితే, ఈ విషయం తెలుసుకుని ప్రయాణం చేయండి.రైలు నెంబర్ 12704 సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే రైలు 17016 సికింద్రాబాద్‌నుంచి భువనేశ్వర్ టైన్ నెంబర్ 12728 హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలును రద్దు చేశారు.
4/5
అర్నాబ్ తుఫాన్ రైళ్ల రద్దు వివరాలు
అదే విధంగా రైలు నెంబర్ 12862 మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలు 12740 సికింద్రాబా్ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలు. 12776 లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వెళ్లే రైలును కూడా అర్నాబ్ తుఫాన్ ప్రభావం వల్ల రద్దు చేశారు
5/5
అర్నాబ్ తుఫాన్
ఇక 17256 లింగంపల్లి నుంచి నర్సాపూర్ వెళ్లే రైలు. 12738 లింగంపల్లి నుంచి కాకినాడ పోర్ట్, 20810 హెచ్ ఎస్ నాందేడ్ నుంచి శంబల్‌పూర్, 07037 చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే రైలు, 07038 శ్రీకాకుళం రోడ్డు నుంచి చర్లపల్లి వచ్చే రైలు అక్టోబర్ 28 కేన్సల్ చేశారు. 12788 నాగర్సల్ నుంచి నర్సాపూర్ పాక్షికంగా రద్దు చేశారు.