SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. త్వరలోనే RAC టికెట్ల రద్దు? ప్రయాణికులకు ఇకపై ఫుల్ బెర్త్ గ్యారెంటీ!

భారతీయ రైల్వేలో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్స్‌ RAC లోకి మారే ఫెసిలిటీ ఉంది. ఇది చార్ట్‌ ప్రిపెయిర్‌ అయ్యే ముందే కేటాయిస్తారు. దీంతో సదరు ప్రయాణీకుడు లోయర్‌ సైడ్‌ బెర్త్‌ మరొకరితో షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, RAC విధానంపై ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 13, 2026, 03:17 PM IST | Updated: Nov 13, 2026, 03:28 PM IST
Image Credit: RAC ending soon:
Join

RAC ending soon: రిజర్వేషన్‌ ఎగెనెస్ట్‌ కేన్సలేషన్‌ (RAC) విధానంలో భారతీయ రైల్వే అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా రైలు టిక్కెట్‌ రిజర్వేషన్‌ అనేది 60 రోజులు ముందుగా బుక్‌ చేసుకుంటాం. ఇది కాకుండా తత్కాల్ టిక్కెట్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఒకరోజు ముందు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. అయితే, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండే టిక్కెట్స్‌ కూడా బుక్‌ చేసుకుంటారు. చార్ట్‌ తయారయ్యే వరకు టిక్కెట్ కన్ఫామ్‌ అవుతుందని బుక్‌ చేసుకుంటారు. ఫుల్‌ బెర్త్‌ వస్తే ఫర్వాలేదు. కానీ, దూర ప్రాంతానికి ప్రయాణించాల్సి వస్తే RAC అంటే ప్రయాణీకులకు ఇబ్బందే. అంటే పూర్తి ధర పెట్టి టిక్కెట్‌ కొనుగోలు చేసిన సైడ్‌ లోయర్‌ బెర్త్‌ మరొకరితో కూడా షేర్‌ చేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది.

ఈ విధానంపై భారతీయ రైల్వే వ్యవస్థ అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుందనే వార్త పలు నేషనల్‌ పత్రికలు రాస్తున్నాయి. RAC బెర్త్‌ వస్తే పడుకోకూడదు..ఎంత దూరం అయినా కూర్చొనే ప్రయాణం చేయాల్సిందే. ఇది ప్రయాణీకులకు ఇబ్బందికరమే. చాలా మంది రైల్వే ప్రయాణీకులు కూడా ఇండియన్‌ రైల్వేకు సోషల్‌ మీడియా వేదికగా ఇదే రిక్వెస్ట్‌ పెట్టారు. ఆర్‌ఏసీ ఇస్తున్నప్పుడు పూర్తి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు కూడా. పార్లమెంటరీ ప్యానెల్‌ వరకు ఈ ప్రతిపాదన చేరుకుందట. బెర్త్‌ ఇద్దరితో షేర్‌ చేసుకున్నాక.. పూర్తిగా డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వస్తుంది?

RAC ఎందుకు రద్దు చేయడం ఖాయమే?
ప్రత్యేకంగా బెర్త్‌ కేటాయించకున్నా ఫుల్‌ టిక్కెట్‌ ధర ఛార్జీ చేయడమే ప్రధాన కారణం. దీంతో ఆర్‌ఏసీ విధానాన్నే రద్దు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారట. ఆర్‌ఏసీ ద్వారా సైడ్‌ లోయర్‌లో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ప్రయాణం చేయాలి. ఇది దూర ప్రాంత ప్రయాణం చేసే వారికి పడుకోవడానికి చాలా ఇబ్బందికరమే.
ఒకవేళ ఒక ఆడ, మగ కలిసి ఒకే బెర్త్‌ చేసుకోమంటే అది మరింత ఇబ్బందికరం. ఆ ట్రైన్‌లో బెర్త్‌ ఖాళీ లేకుంటే టీటీఈ కూడా ‌ప్రత్యామ్నాయంగా ఎలాంటి పరిష్కారం చూపని ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుత నిబంధనను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందా? అనే విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Read Also: Video: వందే భారత్ స్లీపర్‌లో టికెట్ ప్రింట్ తీసుకెళ్లకపోతే ఫైన్ పడుతుందా? రూల్స్‌ ఇవే..!!

Read Also: సంక్రాంతి ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నవంబర్ 14 నుంచే టికెట్ రిజర్వేషన్లు, తేదీలివే!
 

పార్లమెంటరీ ప్యానెల్‌ ఏం సూచించింది?
షేర్డ్ అకామడేషన్ పొందే ప్రయాణికుల నుండి పూర్తి ఛార్జీలు వసూలు చేసే అంశం కూడా పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలనలోకి వచ్చింది.  ఆర్‌ఏసీ ఏర్పాటును సమీక్షించాలని, ప్రయాణికులకు వ్యక్తిగత బెర్త్ సౌకర్యం కల్పించనప్పుడు వారి నుండి పూర్తి ఛార్జీ వసూలు చేయాలా? అనే విషయాన్ని పరిశీలించాలని ఇండియన్ రైల్వేస్‌కు సిఫార్సు చేసింది.

RAC  అంటే ఏంటి?
రిజర్వేషన్‌ ఎగెనెస్ట్‌ కేన్సలేషన్‌ (RAC) అంటారు. కన్ఫామ్‌ బెర్త్‌ లేకున్నా ఈ టిక్కెట్‌తో రిజర్వ్‌డ్‌ కోచ్‌లో రైలు ప్రయాణం చేయవచ్చు. సైడ్‌ లోయర్‌ బెర్త్‌లో ఇద్దరు ప్రయాణీకులు షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కన్పామ్‌ టిక్కెట్స్‌కు వెయిట్‌లిస్ట్‌ టిక్కెట్‌కు మధ్యలో ఈ టిక్కెట్స్‌ ఇస్తారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES