SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలో దృష్టిలోపం ఉన్న భక్తులకు రామ్‌లల్లా దర్శనం మరింత సులభతరం కానుంది. ఈ మేరకు ఐటీసీ మంగళదీప్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ‘హర్ భక్త్ శ్రీరామ్ తక్’ పేరుతో బ్రెయిలీ లిపితో కూడిన ప్రత్యేక రెయిలింగ్‌లను ఏర్పాటు చేస్తోంది.

Written By Zee Telugu News Desk
Published: Nov 05, 2026, 01:45 PM IST | Updated: Nov 05, 2026, 01:46 PM IST
Join

Ayodhya Ram Mandir: దృష్టిలోపం ఉన్న భక్తులకు అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి దర్శనం మరింత సులభతరం చేసేందుకు ఐటీసీ మంగళదీప్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బ్రెయిలీ లిపితో కూడిన రెయిలింగ్‌లను ఏర్పాటు చేస్తూ.. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది. అయోధ్య రామమందిరంలో భక్తులందరికీ స్వామివారి దర్శనం మరింత సులభంగా.. సౌకర్యవంతంగా ఉండేలా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. దృష్టిలోపం ఉన్న భక్తులు కూడా రామ్‌లల్లా దర్శనాన్ని ఆత్మవిశ్వాసంతో ఆస్వాదించేందుకు ఐటీసీ మంగళదీప్ 'హర్ భక్త్ శ్రీరామ్ తక్' (ప్రతి భక్తుడికీ శ్రీరాముడి చేరువ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ దీపోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అయోధ్య రామమందిరంలో బ్రెయిలీ లిపితో కూడిన రెయిలింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి సహాయంతో దృష్టిలోపం ఉన్న భక్తులు ఆలయంలో తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత సులభంగా కొనసాగించవచ్చు. రామ్‌లల్లా దర్శనం సమయంలో వారు సొంతంగా.. ధైర్యంగా ముందుకు సాగేందుకు ఈ ఏర్పాట్లు తోడ్పడనున్నాయి.

ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఐటీసీ మంగళదీప్ పిలుపునిచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా Ayodhyamangaldeepotsav.com వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి రామ్‌లల్లా దర్శనం చేసుకున్న తర్వాత.. తమకు నచ్చిన భాషలో 'రామ్' అని రాయవచ్చు. భక్తులు రాసే ప్రతి 'రామ్' నామం.. దృష్టిలోపం ఉన్న భక్తుల కోసం చేపడుతున్న ఈ ప్రత్యేక మార్గం నిర్మాణానికి ప్రతీకాత్మక సహకారంగా నిలుస్తుందని సంస్థ పేర్కొంది. ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వవచ్చని తెలిపింది.

దృష్టిలోపం ఉన్న భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సులభతరం చేసే ఈ ప్రత్యేక మార్గం పనులు ఇప్పటికే తొలి దశలో కొనసాగుతున్నాయి. భక్తి అనేది అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ ప్రచార సందేశం తెలియజేస్తోంది. సాంకేతికత, సామాజిక బాధ్యతను మేళవిస్తూ భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన అనుభవాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

గమనిక: ఈ కథనం ఐటీసీ మంగళదీప్ సంస్థ అందించిన ప్రకటన సమాచారం ఆధారంగా రాసినది. ఇందులోని వివరాలు సంస్థ ప్రచార సమాచారానికి సంబంధించినవి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

ZEENEWS TRENDING STORIES