Banaras Special Train: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బంపర్ గుడ్‌న్యూస్.. కాశీకి వెళ్లాలనుకునే వారు ఇక వెయిటింగ్ లిస్ట్‌లో ఉండే అవసరం లేదు. తమిళనాడు నుంచి కాశీకి ప్రత్యేక రైలును ప్రకటించారు. ఇది రెండు తెలుగురాష్ట్రాల మీదుగా కూడా వెళ్తుంది. ఇది వరకు కాశీ వెళ్లాలంటే ఉదయం 8 గంటలకు 60 రోజులు ముందుగా టిక్కెట్ బుక్ చేద్దామన్నా.. పూర్తిగా దొరకడం కష్టంగా మారేది. కేవలం రెండు నిమిషాల్లో టిక్కెట్ల బుకింగ్ కూడా అయిపోయేంది. అంతేకాదు ఒక్కోరోజు అయితే, రిగ్రెట్ కూడా చూపిస్తుంది.
తాజాగా భారతీయ రైల్వే కన్యాకుమారి నుంచి బనారస్‌కు ప్రత్యేక రైలును ప్రకటించింది.
ట్రైన్ నెంబర్ 06041 కన్యాకుమారి నుంచి బనారస్ ఎక్స్‌ప్రెస్ రైలు నడవనుంది. కన్యాకుమారి నుంచి మధ్యాహ్నం 2:30 గంటకు నవంబర్ 25వ తేదీ బుధవారం ప్రారంభం అవుతే శుక్రవారం రాత్రి 8 గంటలకు బనారస్ చేరుకుంటుంది.
అదేవిధంగా ట్రైన్ నెంబర్ 06042 బనారస్ నుంచి కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం రాత్రి 10:30 గంటలకు బయలుదేరుతుంది. కన్యాకుమారికి శుక్రవారం ఉదయం 4:45 గంటలకు చేరుకుంటుంది. ప్రధానంగా ఈ ప్రత్యేక రైలును కాశీ తమిళ సంగం 5.0 రైలు ప్రయాణీకులకు అదనంగా కన్యాకుమారి నుంచి బనారస్ రైలు కనెక్టివిటీ పెంచేందుకు ప్రారంభించారు. దక్షిణాది నుంచి మరో రైలు ఇలా కాశీకి వెళ్లనుంది. దీంతో మరింత మంది ప్రయాణీకులు కాశీకి వెళ్లే అవకాశం ఉంది.
ఇక ఈ రైలు తమిళనాడు నుంచి ప్రారంభమై తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వరంగల్, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ గుండా వెళ్తుంది. ఇందులో మొత్తం 4 ఏసీ 2టైర్ కోచ్‌లు 5 ఏసీ 3 టైర్, ఆరు ఏసీ 3 టైర్ ఎకానమీ కోచ్, మూడు స్లీపర్ క్లాసులు, రెండు లాగ్గేజీ, బ్రేక్ వ్యాన్స్ ఉంటాయి.
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయాలంటే రిజర్వేషన్ తప్పనిసరి. ఇది కాకుండా తత్కాల్ టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. 60 రోజులు ముందుగా బుక్ చేసుకుంటే సీట్ రిజర్వేషన్ లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ఈ రిజర్వేషన్ ఓపెన్ అవుతుంది. రద్దీ ఎక్కువగా ఉన్న స్టేషన్‌లకు ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. ఒక్కోసారి టిక్కెట్ దొరకడం కూడా కష్టతరంగా మారుతుంది.
Kashi Tamil Sangamam 5.0: Special Train Services Announced! Train No. 06041 | Kanniyakumari – Banaras Express Special Departure: 25th November 2026 (Wednesday) From: Kanniyakumari at 14:30 hrs Arrival: Banaras at 20:00 hrs (Friday) Train No. 06042 | Banaras – Kanniyakumari Express Special Departure: 1st December 2026 (Tuesday) From: Banaras at 22:30 hrs Arrival: Kanniyakumari at 04:45 hrs (Friday) #KashiTamilSangamam #KTS5 #SouthernRailway #IndianRailways #SpecialTrain #Kanniyakumari #Banaras
— Southern Railway (@GMSRailway) November 17, 2026
కేవలం రైలు టిక్కెట్ ఉన్నవారు మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లేకపోతే భారీ జరిమానా విధిస్తారు. బోర్డింగ్ పాయింట్స్ మార్చుకునే సదుపాయం కూడా భారతీయ రైల్వే కల్పించిన సంగతి తెలిసిందే. టిక్కెట్లు బుక్ చేసుకుని కొన్ని కారణాల వల్ల మీరు ట్రైన్ ఎక్కే సమయంలో కొన్ని కారణాలు వల్ల బోర్డింగ్ పాయింట్స్ మార్చుకోవచ్చు. దీంతో ట్రైన్ టిక్కెట్ కేన్సల్ చేయకుండానే స్టేషన్ మార్చుకోవచ్చు. ఇక కాశీ నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు ఉంది.