Man brutally attacks on police near marine beach in Mumbai: సమాజంలో పోలీసులను చాలా మంది గౌరవంగా చూస్తారు. తమ జీవితాలను, పర్సనల్ లైఫ్ ను సైతం త్యాగం చేసి ప్రజల కోసం, శాంతి భద్రతలను కాపాడటం కోసం డ్యూటీలు చేస్తారు. అయితే.. కొంత మంది సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా పనులు చేస్తారు. పోలీసులపై బూతులు తిడుతూ భౌతికదాడులు సైతం చేస్తారు.
⚠️ ముంబై బీచ్ రోడ్‌లో పోలీసుపై డ్రైవర్ దాడి.. వీడియో వైరల్
📌 ట్రాఫిన్ రూల్స్ పాటించు అని చెప్పినందుకు, ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగిన కారు డ్రైవర్ కోపంతో కొట్టబోయాడు.
📌 చుట్టూ ఉన్న పోలీసులు అతన్ని పట్టుకుని కంట్రోల్ చేశారు, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.#Mumbai… pic.twitter.com/MHzNyOPMt5— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) October 1, 2026
ఈ క్రమంలో ముంబైలోని మెరెన్ డ్రైవ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి ఏకంగా ట్రాఫిక్ పోలీసును బూతులు తిడుతు దాడి చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్ర వ్యక్తం చేశారు.
ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనిలో రహదారిపై తెల్లచొక్కా, ప్యాంట్ వేసుకున్న ఒక డ్రైవర్.. ముగ్గురు పోలీసులపై దాడికి దిగాడు. అంతే కాకుండా.. అతడిని రోడ్డుమీద ఉన్నవారు వారిస్తున్న కూడా వెనక్కు తగ్గలేదు.
రివర్స్ లో పబ్లిక్ లో అందరి ముందే పోలీసులపై దాడులు చేస్తు రెచ్చిపోయాడు. అసలు ఇక్కడ ఏ విషయంలో వివాదం తలెత్తిందో వివరాలు లేవు. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పొస్ట్ చేయగా అదికాస్త వైరల్ గా మారింది.
మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకొవాలని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.