SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttar Pradesh: కర్వాచౌత్ వేళ కట్టుకున్న భర్త చేతిలో భార్య బలి.. యూపీలో వెలుగులోకి అమానుషం.!.

Man kills wife in Uttar Pradesh: కొన్ని రోజులుగా దంపతుల మధ్య ఉపాధి కోసం ఏ నగరంకు వెళ్లాలో అన్నదానిపై వివాదం తలెత్తింది. ఈ క్రమంలో కర్వాచౌత్ పండగ వేళ ఉత్తర ప్రదేశ్ లో కట్టుకున్న భర్త భార్యపై గొడ్డలితో అమానవీయంగా దాడి చేశాడు.

Written By Inamdar Paresh
Published: Oct 29, 2026, 03:41 PM IST | Updated: Oct 29, 2026, 03:50 PM IST
Image Credit: man kills his wife in uttar pradesh
Join

Man brutally kills his wife in uttar Pradesh: ఇటీవల ఎక్కడ చూసిన కొంత మంది భార్యభర్తలు పవిత్రమైన వివిధ బంధాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల భర్తలు తన భార్యలను చంపు తుంటే, మరికొన్ని చోట్ల భార్యలు, తమ భర్తల్ని సుపారీలు ఇచ్చి మరీ మట్టుపెడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో చిన్నచిన్న వివాదాల్ని సైతం కొంత మంది పెద్దది చేసుకుని గొడవలు పడుతున్నారు. మరికొంత మంది వివాహేతర సంబంధాల్ని పెట్టుకుని మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లా అల్హాగంజ్ పరిధిలో దారుణంవెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లో షాజహన్ పూర్ లో అమానవీయకర ఘటన చోటు చేసుకుంది. అది కూడా కర్వాచౌత్ కు ఒక రోజు ముందు ఈ ఘటన చోటు చేసుకొవడం స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది. 

కర్వాచౌత్ రోజున భార్యలు తమ భర్త కోసం రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రికి చంద్రోదయం తర్వాత ఛనీలో చంద్రుడి వెలుగులో భర్త ముఖంను చూసిఉపవాసంను ముగిస్తారు. ఈ విధంగా చేస్తే భర్తకు మేలు జరుగుతుందని, కుటుంబం చల్లగా ఉంటుందని అనాదీగా నమ్ముతారు. ఈ క్రమంలో షాజహాన్‌పూర్ జిల్లా అల్హాగంజ్ పీఎస్ పరిధిలోని చౌరియా గ్రామంలో భర్త తన భార్యను అత్యంత క్రూరంగా దాడి చేసి హతమార్చాడు. అవనీష్(35), సుశీల(30)భార్యభర్తలు. వీరిద్దరికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 

గత కొన్ని నెలలుగా వీరి కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో  భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఉపాధి కోసం వేరే నగరానికి వెళ్లే విషయంలో.. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.  అవనీష్ లుథియానాకు వెళ్లాలని అనుకోగా.. సుశీల మాత్రం ఢిల్లీకి వెళ్లాలని పట్టుబట్టింది. దీంతో విసిగిపోయిన  భర్త.. తన భార్యపై ఆగ్రహంతో ఇంట్లోని గొడ్డలితో అత్యంత క్రూరంగా దాడి చేసి హతమార్చాడు. సుశీల మెడ, ఛాతీపై గొడ్డలితో దాడి చేయడంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది.

ముగ్గురు పిల్లల ముందే.. సుశీల మెడ, ఛాతీపై గొడ్డలితో అవనీష్ దాడి చేశాడు. ఇంతలో భార్య, పిల్లల అరుపులతో అక్కడి నుంచి భర్త పరారయ్యాడు.  ఈ క్రమంలో వెంటనే స్థానికులు అంబులెన్స్ కు, పోలీసులకు సమాచారం అందించారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణన చేపట్టారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.  అవనీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కర్వాచౌత్ వేళ ఈ ఘటనతో ఆ  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES