• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /టోల్‌గేట్ దాటేటప్పుడు జాగ్రత్త.. నిబంధనలు ఉల్లంఘిస్తే నేరుగా రూ.10 వేల ఫైన్..!!

టోల్‌గేట్ దాటేటప్పుడు జాగ్రత్త.. నిబంధనలు ఉల్లంఘిస్తే నేరుగా రూ.10 వేల ఫైన్..!!

NHAI New Rule: వెహికల్ కు సరైన బీమా లేకుండా రోడ్లపైకి వస్తే .. ఇక నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ ప్లాజాల దగ్గర సరికొత్త నిఘా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.

Written ByBhoomi
Published: Nov 18, 2026, 12:55 IST|Updated: Nov 18, 2026, 12:59 IST
joinshare
టోల్‌గేట్ దాటేటప్పుడు జాగ్రత్త.. నిబంధనలు ఉల్లంఘిస్తే నేరుగా రూ.10 వేల ఫైన్..!!
Image Credit: NHAI New Rule:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

NHAI New Rule: వెహికల్ కు సరైన బీమా లేకుండా రోడ్లపైకి వస్తే .. ఇక నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. జాతీయ రహదారుల  ప్రాధికార సంస్థ టోల్ ప్లాజాల దగ్గర సరికొత్త నిఘా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. వెహికల్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినా లేదంటే సరైన పాలసీ లేనట్లయితే.. టోల్ గేట్ దాటగానే యజమానులకు ఎస్ఎంఎస్ ద్వారా వార్నింగ్ వెళ్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ఢిల్లీలోని అర్బన్ ఎక్స్ టెన్షన్ రోడ్ 2 పరిధిలోని ముండ్కా టోల్ ప్లాజ్ వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

ఈ విధానం పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలకు విస్తరించాలని ఎన్ హెచ్ఏఐ భావిస్తోంది. టోల్ గేట్ దాటే ప్రతి వెహికల్ డీటెయిల్స్  నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నిర్వహించే వాహన్ డేటాబేస్ తో అనుసంధానమై ఉంటాయి. ఆటోమేటెడ్ బ్యాకెండ్ వ్యవస్థ ద్వారా ఆ వెహికల్ కు చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందా లేదా క్షణాల్లో చెక్ చేస్తారు. ఒక వేళ పాలసీ సమయం ముగిసినట్లయితే.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మెసేజ్ వస్తుంది.

ఈ హెచ్చరికలో వాహనం నంబర్, టోల్ దాటిన సమయం, భీమా గడువు తేదీకి సంబంధించిన సమాచారం ఉంటుంది. మోటారు వాహనాల చట్టం కింద భారీ జరిమానాలను అరికట్టేందుకు .. పాలసీని వెంటనే పునరుద్ధరించుకోవాలని ఈ మెసేజ్ డ్రైవర్‌కు సూచిస్తుంది. రోడ్డు ప్రమాద బాధితులు నష్టపరిహారం పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

అయితే.. మోటారు వాహనాల చట్టం ప్రకారం, ప్రజా రహదారులపై తిరిగే వాహనాలకు థర్డ్-పార్టీ భీమా తప్పనిసరి. భీమా లేకుండా పట్టుబడితే, మొదటిసారి ప్రాథమిక ప్రీమియం మొత్తానికి మూడు రెట్లు లేదా రూ. 5,000, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. ఇదే నియమాన్ని రెండోసారి ఉల్లంఘిస్తే, ప్రాథమిక ప్రీమియంకు ఐదు రెట్లు లేదా గరిష్టంగా  రూ. 10,000 జరిమానా విధిస్తారు.

టోల్‌ప్లాజాకు 20 కి.మీ. లోపు స్థానికులకు రాయితీ వార్షిక పాస్:

ఇక అటు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలకు కేంద్రం భారీ ఊటరనిచ్చింది. టోల్ గేట్లకు 20 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండే సొంత వెహికల్  కోసం ప్రత్యేకంగా రాయితీతో కూడిన వార్షిక లోకల్ పాస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలోని టోల్ గేట్ దగ్గర ఈ నూతన విధానం నవంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది.

ప్రస్తుతం టోల్ ప్లాజాల దగ్గర స్థానిక వెహికల్స్ కు నెలకు రూ. 360 చొప్పున లోకల్ పాస్ ఇస్తున్నారు. దీని ప్రకారం ఏడాదికి రూ. 4,320 ఖర్చు అవుతోంది. అయితే స్థానికుల ప్రయోజనార్థం ఏడాది కాలానికి కలిపి వార్షిక పాస్ ధరను కేంద్రం రూ. 1500గా ఖరారు చేసింది. మున్సిపల్ పరిధి వెలుపల ఉండే టోల్ ప్లాజాలకు రూ. 1500 మున్సిపల్ లేదా  పట్టణ పరిధిలోని టోల్ ప్లాజాలకు ఏడాదికి రూ. 3వేల రుసుముగా నిర్ణయించారు. గ్రామీణ, వెలుపలి ప్రాంతాల్లోని వారు వార్షిక లోకల్ పాస్ తీసుకుంటే ఏటా రూ. 2,820 వరకు ఆదా కానున్నాయి.

తమ వ్యక్తిగత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉన్నవారు, నిర్దేశిత టోల్ ప్లాజాల వద్ద అపరిమిత ప్రయాణం కోసం ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. అర్హులైన స్థానికులు ఈ పాస్‌ను నేరుగా ఆయా టోల్ ప్లాజాల నుండే పొందవచ్చు. అదనంగా, డిసెంబర్ 1వ తేదీ నుండి  రాజస్థ యాత్ర మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తోంది.  టోల్ ప్లాజాల సమీపంలో నివసించే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వార్షిక లోకల్ పాస్‌లను అమలు చేస్తోందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. పని, వ్యాపారం నిమిత్తం రోజూ టోల్ గేట్ల గుండా ప్రయాణించే స్థానిక ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ సౌకర్యాన్ని కల్పించింది.

Also Read: 

జీరో నుండి ఆకాశమంత ఎత్తు వరకు.. సమాజ భాగస్వామ్యంతో ఒక వెలుగు వెలిగిన మేకల మండి సర్కారు బడి ప్రస్థానం..!!

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీపీఎస్ రద్దుపై కీలక అడుగు..త్వరలో ప్రత్యేక అధ్యయన కమిటీ..!!

 

ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమలుపై సీఎం హామీ.. కానీ జీవో ఇప్పుడే ఇవ్వాలి: శ్రీపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News