SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

No UPI Day on October 2: UPI వాడే వారికి షాకింగ్ న్యూస్.. అక్టోబర్ 2న మీ UPI పని చేయదు..ఎందుకో తెలుసా?

No UPI Day on October 2: దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు చేసే వ్యాపారులకు కొత్త ఛార్జీల ప్రతిపాదనపై వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న ‘No UPI Day’ నిర్వహించాలని పలు వ్యాపార సంఘాలు నిర్ణయించాయి. గాంధీ జయంతి రోజున చేపట్టనున్న ఈ నిరసనలో భాగంగా యూపీఐ స్కానర్లు, క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్సులను నల్లటి వస్త్రంతో కప్పాలని వ్యాపారులు భావిస్తున్నారు.

Written By Vishnu Priya
Published: Sep 24, 2026, 10:01 PM IST | Updated: Sep 24, 2026, 10:10 PM IST
Join

No UPI Day on October 2: అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం MDR (Merchant Discount Rate) వసూలు చేసే కొత్త విధానం అమల్లోకి రానుందని సమాచారం. ఈ ఛార్జీని కస్టమర్ల నుంచి కాకుండా వ్యాపారుల నుంచి వసూలు చేయనున్నారు. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 వరకు ఛార్జీ ఉండొచ్చు.

వ్యాపారులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

చిన్న మార్జిన్లతో వ్యాపారం చేసే రిటైలర్లు, పంపిణీదారులకు అదనపు ఛార్జీ భారం అవుతుందని వ్యాపార సంఘాలు చెబుతున్నాయి. యూపీఐ వల్ల నగదు వినియోగం తగ్గడంతో పాటు లావాదేవీలు పారదర్శకంగా మారాయని వారు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ చెల్లింపులపై అదనపు ఖర్చు విధించడం సరికాదని వారి వాదన.

మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ (MACCIA) ఈ నిరసనకు పిలుపునిచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లోని వ్యాపార సంఘాలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే చిన్న వ్యాపారులకు కొంత మినహాయింపు ఉంటుంది. నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు రూ.2,000కు పైబడిన వ్యక్తిగత లావాదేవీలపై MDR నుంచి మినహాయింపు ఉండనుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులకు ఈ నిబంధన ఉపయోగపడే అవకాశం ఉంది.

భారీ మొత్తంలో యూపీఐ లావాదేవీలు

ఆగస్టులో యూపీఐ ద్వారా 15.51 బిలియన్ పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.8.95 లక్షల కోట్లు. ఇందులో రూ.2,000 కంటే ఎక్కువ లావాదేవీలు మొత్తం విలువలో దాదాపు 67 శాతం ఉన్నట్లు సమాచారం.

పెట్రోల్ బంకులు, స్టాక్ మార్కెట్ రంగాలకు కూడా MDRపై చర్చలు జరుగుతున్నాయి. వ్యాపార సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 2న జరిగే ‘No UPI Day’ తర్వాత తమ డిమాండ్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: రైతుల నిరీక్షణకు తెర.. అక్టోబర్‌లోనే పీఎం కిసాన్ డబ్బులు! మీ ఖాతాలో పడాలంటే ఇది తప్పనిసరి?

Also Read: CEC Resignation: కాక్రోచ్‌ పార్టీ మరో సంచలన నిర్ణయం.. ఆయన రాజీనామా చేయకపోతే జంతర్‌ మంతర్‌ 2.0

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES