SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Supreme Court: ఇంటర్నెట్,మెట్రోలు పునరుద్దరించండి.. ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

SC On Delhi CJP Protest: మెట్రో, రైల్వే సేవలు, ఇంటర్నెట్ సేవలను యథాతథంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా శాంతిభద్రతలు లేదా ట్రాఫిక్ సమస్యలు ఉంటే తప్ప ఇతర ప్రదేశాలలో ఉన్న బారికెడ్లను తొలగించాలని స్పష్టం చేసింది.

Written By Inamdar Paresh
Published: Oct 11, 2026, 02:01 PM IST | Updated: Oct 11, 2026, 02:09 PM IST
Image Credit: supremecourt(file)
Join

Supreme court key orders on cjp protest in delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసలు కొనసాగుతున్నాయి.  సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ తో జంతర్ మంతర్ అట్టుడికిపోతుంది. ఈ క్రమంలో ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో పోలీసులు నెట్ పై  ఆంక్షలు విధించారు. మెట్రో, రైళ్లు నిలిపివేశారు. ఎక్కడికక్కడ బారికెడ్లు ఏర్పాటు చేసి కాక్రోచ్ లను అడ్డుకున్నారు.  

ఢిల్లీకి వచ్చిన కాక్రోచ్ నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికి క్రితం కాక్రోచ్ పార్టీ ముఖ్యనేతలైన  అభిజిత్ దీప్కే,   సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు  విడుదల చేసింది. మరోవైపు ఢిల్లీకి చెందిన న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఢిల్లీలో విధించిన కఠిన  ఆంక్షలపై పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలో  చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి ప్రజలు, వాహనాల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతించాలని స్పష్టం చేసింది. 

అంతే కాకుండా ఇంటర్నేట్  సేవలు, మెట్రోలు, రైళ్లను  పునరుద్దరించాలని అత్యున్నత ధర్మాసనం తెల్చి చెప్పింది. నిర్దిష్ట ప్రాంతాల్లో ఆంక్షలు విధించిన ప్రదేశంలో మినహా, శాంతియుతంగా సమావేశమయ్యే వారిని అక్రమంగా నిర్బంధించకూడదని ధర్మాసనం ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేసింది. 

దీనిపై కేంద్రం తరపు లాయర్లు.. ఢిల్లీలో నెట్ సేవలు,  మెట్రో, రైళ్లను పునరుద్దరించినట్లు చెప్పారు.  దీనిపై మరిన్ని వివరాలు సమర్పించాలని కోరుతూ  మంగ‌ళ‌వారానికి తదుపరి విచారణకు సుప్రీంకోర్టు కేసును వాయిదా వేసింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES