Parents forgotten their child in sea while making reels: ఇటీవల కొంత మంది యువతీ, యువకులు రీల్స్ మోజులో దారుణాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన కూడా తమస్మార్ట్ ఫోన్ తీసి సెల్ఫీలు, రీల్స్ చేస్తు చుట్టుపక్కల వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్నిసార్లు వీరి రీల్స్ పిచ్చి వీరితో పాటు, పక్కనున్న వారిని సైతం డెంజర్ లో నెట్టుతుంది. ఈ క్రమంలో కొంత మంది సోషల్ మీడియాలో ఎలాగైన ఫెమస్ కావాలని, లైక్ లు, కామెంట్స్ లు రావాలని తమ పైత్యం బైటపెడుతున్నారు.
आज Husband के साथ समुन्द्र पर घूमने गई थी जहाँ हमने देखा एक पति पत्नी Reel बनाने में इतने मगन थे अपनी बच्ची को पानी में ही छोड़ दिया। बच्ची समुन्द्र की लहरों में बहने से बच गई एक भय्या ने ध्यान दिया और बचा लिया। क्या अब Reel बाजी लोगों के लिए इतनी जरूरी हो गई है अपने बच्चों... Real news
— 𝗠𝗮𝗿𝗶𝘆𝗮𝗺_𝗠𝗕𝗗 (@Mariyam_MBD) October 19, 2026
ఇలాంటి క్రమంలో వీళ్లు చేసే స్టంట్ లు అందరిని షాక్ కు గురిచేస్తున్నారు. ఇప్పటికే రీల్స్ మోజులో పడి రెప్పపాటులో నిండు ప్రాణాలు పోయిన ఘటనలు కొకొల్లలు. తాజాగా.. ఒక జంట బీచ్ లో రీల్స్ తీస్తు తమ కూతురిని అలల్లో వదిలేశారు.ఈ వీడియో వైరల్గా మారింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక జంట సముద్రంకు వెళ్లారు. వారు తమ స్మార్ట్ ఫోన్ తీసి రీల్స్ రికార్డు చేస్తున్నారు. పక్కనే కూతురు ఉంది. ఇంత వరకు బాగానే ఉన్న వారు రీల్స్ పిచ్చిలో పడి బలమైన అలల్లో తమ కూతుర్ని వదిలేశారు. కనీసం ఆమె పక్కనుందా లేదా అని కూడా చూసుకొలేదు.
పాపం చిన్నారి బలమైన అలల్లో ఒక్కసారిగా కొట్టుకునిపోయింది. ఇంతలో చిన్నారిని ఒక యువకుడు గమనించాడు. వెంటనే ఆమెను అలల్లో నుంచి బైటకు తెచ్చాడు. తల్లిదండ్రులను అలర్ట్ చేశాడు. దీంతో అప్పటికి కానీ వారు రీల్స్ పిచ్చి నుంచి బైటకు రాలేదు.
అక్కడున్న వారు ఈ జంటను ఇంత నెగ్లీజెన్సీగా ఉంటే ఎలా అంటూ ఏకీపారేశారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పిల్లలు లేని వారికి వాళ్ల విలువ తెలుస్తుంది. మరీ ఇంత రీల్స్ పిచ్చి ఏంటని ఫైర్ అవుతున్నారు.