• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Traffic Challan: వాహనదారుల జేబుకు చిల్లు.. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్‌లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

Traffic Challan: వాహనదారుల జేబుకు చిల్లు.. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్‌లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

Supreme Court Sensation Orders On Pending Traffic Challan: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులకు సుప్రీంకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొట్టే వారికి వారి ఇంటి విద్యుత్‌ బిల్లులకు లింక్‌ పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఝలక్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 28, 2026, 10:40 PM IST|Updated: Sep 28, 2026, 10:43 PM IST
joinshare
Traffic Challan: వాహనదారుల జేబుకు చిల్లు.. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్‌లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
Image Credit: Traffic Challan Link With Electricity Bill

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pending Traffic Challan: వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన చలాన్లు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిన వారికి సుప్రీంకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు తమ చలాన్లు చెల్లించకుండా జాప్యం చేస్తుంటే వారికి ఝలక్‌ ఇచ్చేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించని వాహనదారుల ఇంటి కరెంట్‌ బిల్లులకు లింక్‌ చేయాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించకుండా తప్పించుకు తిరిగే వాహనదారుల నుంచి బకాయిలు వసూలు చేయాలంటే ఆ మొత్తాన్ని వారి ‘కరెంట్ బిల్లు’కు జత చేయాలని సుప్రీంకోర్టు సూచన చేసింది. అలా చేస్తే విద్యుత్ బిల్లు చెల్లించకపోతే పవర్ కనెక్షన్ తొలగిస్తారు కాబట్టి ఆ భయంతోనైనా ట్రాఫిక్‌ చలాన్లు చెల్లిస్తారని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. చలాన్లు వేయడం తేలిక కానీ ఆ జరిమానాలు వసూలు చేయడం అసలైన సవాల్‌ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

కోయంబత్తూర్‌కు చెందిన ఓ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ 2012లో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సోమవారం విచారణలో న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేసశారు. లక్షలాది ఇ-చలాన్లు జారీ చేస్తే సరిపోదని.. చలాన్లకు సంబంధించిన జరిమానాలు వసూలు చేయడమే అసలైన సవాల్‌ అని సుప్రీంకోర్టు తెలిపింది. అన్నీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకంగా రూ.45,000 కోట్ల మేర ఇ-చలాన్ల జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిలో కేవలం రూ.25,000 కోట్లు మాత్రమే జరిమానాలు వసూలు చేసినట్లు న్యాయస్థానం వెల్లడించింది. మిగిలిన రూ.20,000 కోట్ల ట్రాఫిక్‌ చలాన్ల బకాయిల వసూలుకు వ్యవస్థాగతమైన కఠిన చర్యలు అవసరమని న్యాయమూర్తులు తెలిపారు.

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు చెల్లించని వాహనదారుల నుంచి జరిమానాలు వసూల్‌ చేసేందుకు సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. పెండింగ్ చలాన్లు పూర్తిగా క్లియర్ అయ్యేంత వరకు వాహన రిజిస్ట్రేషన్ పత్రాల పునరుద్ధరణ (ఆర్‌సీ రెన్యూవల్‌), డూప్లికేట్ ఆర్సీల జారీ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల మంజూరు నిలిపివేయాలని అత్యున్నత ధర్మాసనం సూచించింది. పెండింగ్‌ చలాన్లు ఉన్న వాహనాలను ‘పరివాహన్’ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయాలని.. ఆ వాహనాల యాజమాన్య బదిలీ (ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌)ని నిలిపివేయాలని న్యాయమూర్తులు సూచించారు. అవసరమైతే అలాంటి వాహనాలను స్వాధీనం (సీజ్) చేయాలని సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూచించారు. కాలుష్య నియంత్రణ (పీయూసీ) ధ్రువపత్రాలు కూడా చలాన్లు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది.

పెండింగ్‌ చలాన్లపై సుప్రీంకోర్టు ఈ స్థాయిలో స్పందించడం విస్తుగొలిపింది. ట్రాఫిక్‌ చలాన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాహనదారుల నుంచి చలాన్లు వసూల్‌ చేసేందుకు కరెంట్‌ బిల్లుకు లింక్‌ పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో వాహనదారులు విస్తుపోయారు. ట్రాఫిక్‌ పోలీసులు అడ్డగోలుగా విధించే చలాన్లు సుప్రీంకోర్టు మద్దతు తెలపడాన్ని వాహనదారులు ఖండిస్తున్నారు. తమ చలాన్లు వసూళ్లపై సూచనలు ఇచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం రోడ్లు బాగు చేయడం.. ప్రమాదాల నియంత్రణపై పోలీసులకు ఎందుకు సూచనలు చేయడం లేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్‌ చలాన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ సూచనలను పోలీసులు పాటిస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

Add Zee News as a Preferred Source
TAGS:
Supreme Court
Telugu News
National News
Trending News