SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ludhiana School Assault: పంజాబ్‌లో ఘోరం.. స్కూల్లో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తు ముద్దులు.!..

Ludhiana school peon row: స్కూల్లో యువతి పుస్తకం కోసం ఒక గదికి వచ్చింది. ఆమెకు పుస్తకం వెతకడంతో ప్యూన్ సాయం చేశాడు. ఆతర్వాత ఆమెను బలవంతంగ ముద్దు పెట్టాడు. లుధియానాలోని ప్రైవేటు స్కూల్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రవివాదంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 19, 2026, 05:19 PM IST | Updated: Oct 19, 2026, 05:26 PM IST
Image Credit: Ludhiana school peon row
Join

Peon arrested after 16 year old girl student molested Ludhiana: ఇటీవల స్కూల్లో తరచుగా అమ్మాయిలు వేధింపుల బారిన పడుతున్నారు. కొంత మంది కామాంధులు స్కూల్లో అమాయకులైన మైనర్ యువతుల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. అభం శుభం తెలియని వారిపట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. దేవాలయంలాంటి స్కూళ్లలో పాడుపనులు చేస్తున్నారు.  విద్యార్థినుల పర్సనల్ పార్ట్ లను తాకడం, ముద్దులు పెట్టుకొవడం, బెదిరింపులకు గురిచేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ లోని లుధియానాలోని ఒక ప్రైవేటు స్కూల్లో దారుణం వెలుగులోకి వచ్చింది.

పంజాబ్ లోని లుధియానా స్కూల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లుధియానాలోని ఒక ప్రైవేటు స్కూల్లో మైనర్ బాలిక పట్ల ఆ స్కూల్ ప్యూన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. స్కూల్ లో ఆమె క్లాస్ టీచర్ ఒక గదిలోకి వెళ్లి బుక్ తెమ్మన్నాడు. ఆమె వెనుకాలే ప్యూన్ కిప్యున్ ప్రిన్స్ వెళ్లాడు. 

ఆమెకు సాయం చేసినట్లునటించాడు. ఇంతలో బుక్ దొరగ్గానే ఆమెను గట్టిగా హత్తుకుని ప్రైవేటు పార్ట్ లను టచ్ చేసి ముద్దు పెట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురై ఇంటికి వచ్చి ఈ దారుణం గురించి చెప్పింది. వెంటనే ఇంట్లోని వారు పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన పోలీసులు ఆ స్కూల్ లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.దానిలో యువతిని వేధిస్తుండటం స్పష్టంగా రికార్డు అయ్యింది.  దీంతో పోలీసులు ప్యూన్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన లుధియానాలో స్థానికంగా తీవ్ర వివాదంగా మారింది. నిందితుడిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES