భార్యాభర్తలిద్దరికీ నెలకు రూ.6,000 పెన్షన్! పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన కొత్త రూల్స్ ఇవే..!
PM Kisan Maan Dhan yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతులకు ప్రారంభించింది. ప్రధానంగా ఇది వారి సాగు, సంక్షేమం కోసం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. చిన్న సన్నకారు రైతుల కోసం కేంద్రం చిన్న సన్నకారు రైతుల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన ప్రారంభించింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ ప్రతి నెల రూ.6000 పెన్షన్ కూడా పొందవచ్చు.
PM Kisan Maan Dhan yojana: చిన్న సన్నకారు రైతుల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 60 ఏళ్ల దాటిన తర్వాత నెలవారీ పెన్షన్ లభిస్తుంది. రూ.3000 పెన్షన్ పొందవచ్చు. భార్యాభర్తలు కలిపి రూ.6000 కలిపి పొందవచ్చు.
పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా నెలవారీ కంట్రిబ్యూషన్ చేస్తే మీరు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీ పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం ద్వారా పెన్షన్ పొందాలంటే ముందుగా రూ.55 నుంచి రూ.200 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. తక్కువ వయస్సు నుంచి ఈ పథకంలో చేరితే ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. ఇందులో రైతుతోపాటు ప్రభుత్వం తరఫు నుంచి కూడా పెట్టుబడి లభిస్తుంది.
భార్యాభర్తలకు లాభం..
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా భార్యాభర్తలు పొందవచ్చు. అయితే, ప్రారంభంలోనే వేర్వేరుగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రతినెలా రూ.3000 పొందవచ్చు. ఇక భార్యాభర్తలు వేర్వేరుగా పెట్టుబడి పెడితే రూ.6000 పొందుతారు.
Read Also: మీ ఖాతాలో రూ.2000 పడ లేదా? మొబైల్ నంబర్, వివరాలు ఇలా వెంటనే అప్‌డేట్ చేయండి!
Read Also: పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ షాక్! ఆ తప్పు చేస్తే రూ. 2,000
అర్హత..
రైతులు ఈ పథకంలో పెట్టాలంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రైతులకు రెండు ఎకరాలలోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్న రైతులు రెగ్యులర్‌గా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.
పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనకు దరఖాస్తు చేసుకునే విధానం..
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజనకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, భూరికార్డులు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే, ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగానే అర్హత వివరాలు తెలుసుకోవాలి. ఈ స్కీమ్‌కు సంబంధించిన రూల్స్ కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు.