SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఈ నెల 30న రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్ డబ్బులు..

PM Kisan Samman Nidhi: భారత దేశ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్‌ నిధులు ఈ నెల 30న రైతులు అకౌంట్లలో డిపాజిట్ చేయనున్నారు. దీపావళి కానుకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 24వ విడత డబ్బులు విడుదల చేయనున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 24, 2026, 10:35 AM IST | Updated: Oct 24, 2026, 10:38 AM IST
Image Credit: PM Kisan Yojana (ZEE News Telugu/Source)
Join

PM Kisan Money: దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్రంలోని నరేంద్ర సర్కారు తీపి కబురు చెప్పింది. దీపావళి పండుగ పురస్కరించుకునొ రైతులకు  కానుకగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత సొమ్మును విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన ప్రతి రైతు ఖాతాలో 2వేల రూపాయల  చొప్పును నేరుగా జమ చేయనున్నారు.

రబీ పంటల పెట్టుబడికి సరిగ్గా పండుగ ముందు ఈ ఆర్థిక సాయం అందుతుండటంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 
అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథక ప్రయోజనం దక్కాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇప్పటివరకు తమ ఖాతాకు ఇ-కేవీసీ ప్రక్రియను పూర్తి చేయని రైతుల ఖాతాల్లో నిధులు జమ కావని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కాబట్టి రైతులు వెంటనే తమ సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి లేదా పీఎం కిసాన్ పోర్టల్/యాప్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలిని సూచించింది. దీనితో పాటు భూమి వివరాల ధ్రువీకరణ, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం పూర్తయిన వారికి మాత్రమే ఈ విడత సొమ్ము త్వరలోనే  జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు ఇతోధికంగా ఆర్ధిక సాయం అందిస్తున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES