కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్.. ఉచితంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇలా పొందండి!
రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రకటించింది, దాని పేరు పీఎం రాహత్ పథకం. దీని ద్వారా గోల్డెన్ అవర్లో సమీపంలోని ఆసుపత్రిలో ఒక లక్ష యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు చికిత్స పొందవచ్చు. పీఎం రాహత్ అనేది కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న క్యాష్లెస్ చికిత్స. అయితే ఈ పథకం ద్వారా ప్రయోజనం ఎలా పొందాలి, ఎవరికి వర్తిస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
PM RAHAT Scheme: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గొప్ప పథకాలలో ఈ పీఎం రాహత్ (PM RAHAT - Prime Minister Road Accident Victims' Hospitalisation and Assured Treatment) ఒకటి. అనుకోని ప్రమాదం నుంచి ఆదుకునే స్కీమ్ అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు. ముఖ్యంగా బైక్లుపై ప్రయాణించేవారికి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆకస్మిక ప్రమాదాలకు గురైనప్పుడు, వారిని సమీప ఆసుపత్రికి తరలించినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ సమయంలో బాధితులకు క్యాష్ లెస్ చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఈ పీఎం రాహత్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే, చికిత్స కోసం బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉచిత చికిత్స రూపంలో అందిస్తోంది. ఈ పథకం కింద రూ. 1.50000 కవరేజీ లభిస్తుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా గోల్డెన్ అవర్‌లోనే ఆసుపత్రికి తీసుకెళ్తేనే ఈ కవరేజీ లభిస్తుంది, తద్వారా ప్రాణాలు కూడా కాపాడవచ్చు. ఆకస్మిక ప్రమాదాల సమయంలో బాధితుల వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
Read Also: నవంబర్ 1 నుంచి భారీ మార్పులు.. నాన్-BS6 వాహనాలపై బ్యాన్, మారనున్న LPG గ్యాస్ ధరలు.. కాలర్ ID కొత్త రూల్!
Read Also: ఆధార్‌కు ఈమెయిల్ ఐడీని ఉచితంగా ఎలా లింక్ చేయాలి? డిసెంబర్ 31లోపు మొబైల్‌లోనే ఇలా చేసేయండి!
ఈ పీఎం రాహత్ పథకాన్ని పీఎం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీని ప్రధాన లక్ష్యం రోడ్డు ప్రమాద బాధితులపై ఆర్థిక భారం పడకుండా వైద్య చికిత్స అందించడం. ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి ఏడు రోజుల వరకు ఈ కవరేజీ లభిస్తుంది. ఇది అన్ని వర్గాల ప్రజలకు వర్తించే అద్భుతమైన పథకమని చెప్పవచ్చు. ఈ క్యాష్ లెస్ చికిత్స నేరుగా ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధానంలో అమలవుతుంది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఈ కవరేజీ అందుతుంది. ప్రమాదానికి గురైన వాహనానికి బీమా ఉందో లేదో తనిఖీ చేసిన తర్వాత ఈ చెల్లింపులు జరుగుతాయి. నగదు రహిత చికిత్స అంటే రోగి లేదా వారి కుటుంబం ముందుగా ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ముందుగా బాధితుడికి చికిత్స అందించడమే ప్రధాన లక్ష్యం.