• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /కోల్‌కతాలో దుర్గాపూజలో.. యువతితో పోలీస్ అధికారి అనుచిత ప్రవర్తన.. వీడియో..

కోల్‌కతాలో దుర్గాపూజలో.. యువతితో పోలీస్ అధికారి అనుచిత ప్రవర్తన.. వీడియో..

Kolkata Police Officer Viral Video: విజయదశమి వేడుకల్లో భాగంగా ఓ యువతిపై ఒక పోలీస్ ఆఫీసర్ అణిచితంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ కావడంతో.. అధికారులు సదరు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 20, 2026, 12:32 PM IST|Updated: Oct 20, 2026, 12:34 PM IST
joinshare
కోల్‌కతాలో దుర్గాపూజలో.. యువతితో పోలీస్ అధికారి అనుచిత ప్రవర్తన.. వీడియో..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఇంట్లో గిన్నెలు కడుగుతున్న రెండు కోతులు.. వాటి పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఇంట్లో గిన్నెలు కడుగుతున్న రెండు కోతులు.. వాటి పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

2

30 అడుగుల అనకొండతో చిన్నారి ఆటలు.. వైరల్ వీడియో

3

Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు.. ఇంట్లోంచి 7 కిలోల వెండి, 90 గ్రాములు బంగారం మాయం.. వీడియో..

4

Video Viral: రీల్స్ మోజులో అరాచకం.. కూతుర్ని సముద్రంలో వదిలేసిన తల్లిదండ్రులు.. షాకింగ్ వీడియో...

5

దుర్గమ్మ విగ్రహంపై ప్రత్యక్షమైన నాగుపాము.. వైరల్‌ వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kolkata Police Officer Viral Video: పవిత్రమైన విజయదశమి పండగ వేల.. ప్రజల రక్షణ బాధ్యతంలో ఉండాల్సిన ఓ పోలీస్ అధికారి ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. కోల్‌కతా ఆర్మ్‌డ్ పోలీసు విభాగానికి చెందిన ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఉన్నత అధికారులు ఆ అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఆ వీడియో అంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? వీడియోలో ఆ పోలీస్ ఆఫీసర్ చేసిన తప్పేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నవరాత్రుల సందర్భంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కత్తాలో దుర్గా పూజ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా అక్కడ అత్యంత ప్రసిద్ధి కలిగిన సురుచి సంఘ పూజ మండపం వద్ద భద్రత కోసం కోల్‌కతా ఆర్మ్డ్ పోలీస్ విభాగానికి చెందిన సదరు ఏఎస్ఐ ను విధుల్లో నియమించారు. అయితే, ఆ అధికారి విధుల్లో ఉన్న సమయంలో ఒక యువతి పట్ల హద్దులు దాటి అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా కెమెరాలు రికార్డు అయి.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది..

అలాగే వైరల్ అయిన వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో వారు ఈ ఘటనపై తక్షణమే స్పందిస్తూ వచ్చారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ అధికారిని అరెస్టు చేసినట్లు అక్కడున్న మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న సంఘటనకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? నిజంగా అక్కడ ఏం జరిగి ఉంటుందని పూర్తి వివరాలపై శాఖాపరమైన విచారణ కూడా కొనసాగుతూ వస్తోందని సమాచారం. అధికారిక నివేదికలతో పాటు సాక్ష్యాధారాల ఆధారంగానే వాస్తవాలు వెలుగులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

లక్షలాది మంది భక్తులతో పాటు మహిళలు, పిల్లలు తరలివచ్చే ఉత్సవాల వద్ద శాంతి భద్రతలను కాపాడాల్సిన యూనిఫామ్ ధరించిన వ్యక్తి అత్యంత క్రమశిక్షణతో.. బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.. పోలీసు వ్యవస్థ పై ప్రజల్లో ఉండే నమ్మకాన్ని కాపాడటంలో ప్రతి ఒక్క అధికారి క్రియాశీలక పాత్ర పోషిస్తారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా అనుచిత ప్రవర్తన ఏ మాత్రం మంచిది కాదని సంకేతాన్ని అందించే ఈ ఘటన జరగడం అత్యంత సిగ్గుచేటని అక్కడున్న స్థానికులు అభిప్రాయపడుతున్నారు.. అంతేకాకుండా ఆఫీసర్ పై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by INDIA | BHARAT | HINDUSTAN (@hindustansociety)

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News