SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పోస్టాఫీస్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ATM క్యాష్ విత్‌డ్రాయల్ రూల్స్ మారాయి.. రోజువారీ లిమిట్ ఎంతంటే?

మీకు పోస్ట్‌ఆఫీస్‌ ఖాతా ఉందా? అయితే, దానికి ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకుంటున్నారా? అయితే, ఈ విషయం ముందుగా తెలుసుకోండి. పోస్ట్‌ ఆఫీస్‌ ఏటీఎం లావాదేవీల రూల్స్‌ మారాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 10, 2026, 02:39 PM IST | Updated: Nov 10, 2026, 02:41 PM IST
Image Credit: Post Office ATM Charges:
Join

Post Office ATM Charges:  పోస్టు ఆఫీస్‌ ఖాతా ఉన్నవారికి సేవింగ్స్‌ ఖాతా, ఆర్డీ వంటివి ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక డిపాజిట్‌ స్కీమ్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, మీకు పోస్ట్‌ ఆఫీస్‌ ఖాతా ఉందా? పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌ ఖాతాకు ఏటీఎం ఉంటే దాని విత్‌డ్రా రూల్స్‌ కూడా ముందుగా తెలుసుకోండి.  ఎందుకంటే ఇండియా పోస్ట్‌ కొంత క్యాష్‌ విత్‌డ్రా చేసిన తర్వాత క్యాప్‌ ఉంటుంది. అంటే రోజులో మీరు పోస్ట్‌ ఆఫీస్‌ ఖాతా నుంచి కేవలం రూ.25000 మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు ఒక్క ట్రాన్సక్షన్‌ కూడా రూ.10000 మించకూడదు. అంతేకాదు ప్రతి నెలా ఎన్ని ఉచిత లావాదేవీలు జరపవచ్చు? ఆ తర్వాత ఎంత ఛార్జీలు వసూలు చేస్తారు.

పోస్ట్‌ ఆఫీస్‌ ఏటీఎం డైలీ లిమిట్‌..
పోస్ట్‌ ఆఫీస్‌ శాఖ ప్రకారం ఒక్క రోజులో ఏటీఎం నుంచి కేవలం రూ.25000 మాత్రమే విత్‌డ్రా చేయాలి. సింగిల్‌ ట్రాన్సక్షన్‌ లిమిట్‌ రూ.10000, కనీస బ్యాలన్స్‌ రూ.500. డైలీ లిమిట్‌ విత్‌ డ్రా చేయాలంటే మొదట రెండుసార్లు రూ.10000, ఆ తర్వాత రూ.5000 విత్‌డ్రా చేయాలి.  అంతేకాదు మీ ఖాతాలో కనీస బ్యాలన్స్‌ ఇంకా రూ.500 ఉండలి. లేకపోతే మీ లావాదేవీలు ప్రాసెస్‌ కాకుండా పోతుంది.

ఎన్ని ఉచిత లావాదేవీలు?
ఏటీఎం కార్డు అనేది పోస్ట్‌ ఆఫీస్‌ ఉచిత కోటా ఆధారంగా లావాదేవీలు జరుపుతారు. అయితే, బ్యాంకు ఏటీఎం, పోస్ట్‌ ఆఫీస్‌ ఏటీఎం కాస్త భిన్నంగా రూల్స్‌ ఉంటాయి. పోస్ట ఆఫీస్‌ ఏటీఎంతో లావాదేవీలు జరిపితే నెలకు 5 ఉచిత లేదా నాన్‌ ఫైనాన్షియల్‌ లావాదేవీలు జరపవచ్చు.

ఇతర బ్యాంకులు అయితే, వివిధ బ్యాంకుల ఏటీఎంల ద్వారా డబ్బు విత్‌డ్రా చేయవచ్చు. బ్యాలన్స్‌ ఎంక్వైరీ, ఉచిత ట్రాన్సక్షన్స్‌ కూడా జరపవచ్చు. 6 మెట్రీ సిటీల్లో ప్రతినెలా మూడు ఉచిత లావాదేవీలు, నాన్‌ మెట్రో సిటీల్లో ఐదు ఉచిత లావాదేవీలు జరపవచ్చు.

ఇక ఉచిత లిమిట్‌ దాటిన తర్వాత 2025 నవంబర్‌ 1 నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. అంటే మీ ఖాతా వేరే బ్యాంకు అయితే, మీరు ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయాల్సి వస్తే రూ.23 తోపాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ బ్యాలన్స్‌ చెక్‌ చేస్తే రూ.11 ప్లస్‌ జీఎస్టీ చెల్లించాలి. మీకు కావాల్సిన డబ్బు ఉచిత పరిమితి ఉన్నప్పుడే విత్‌డ్రా చేస్తే అదనపు ఛార్జీలు మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇక పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌ ఖాతాలో ఏటీఎం ద్వారా డబ్బు విత్‌ డ్రా చేస్తే రూ.500 తప్పనిసరిగా కనీస బ్యాలన్స్‌ ఉండాలి. లేకపోతే రూ.50 నిర్వహణ ఫీజుగా వసూలు చేస్తారు. ఇక పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌ ఖాతా వడ్డీ ప్రతినెలా 10వ తేదీ నుంచి చివరి నెలకు లెక్కిస్తారు. ఈ వడ్డీ డబ్బులు ప్రతి ఏడాది జమ చేస్తారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES