• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు అలెర్ట్‌.. నవంబర్ 14 నుంచి భారీగా రైళ్లు రద్దు, దారి మళ్లింపు!

తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు అలెర్ట్‌.. నవంబర్ 14 నుంచి భారీగా రైళ్లు రద్దు, దారి మళ్లింపు!

రైలు ప్రయాణీకులకు అలెర్ట్‌.. నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా మనోహరబాద్ యార్డు వైపు వెళ్లే పలు రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని నిర్ధిష్ట సమయంలో నియంత్రించి నడుపుతోంది. ఈ మార్పులు నవంబర్ 14 నుండి 22 వరకు అమల్లో ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 17, 2026, 08:08 AM IST|Updated: Oct 17, 2026, 08:12 AM IST
joinshare
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు అలెర్ట్‌.. నవంబర్ 14 నుంచి భారీగా రైళ్లు రద్దు, దారి మళ్లింపు!
Image Credit: SCR Train Cancellation

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
BJP అగ్ర నేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత..

BJP అగ్ర నేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత..

2

రాహు గ్రహ సంచారంతో అదృష్టం మారనుందా? ఈ రాశుల వారికి కీలక సూచనలు..

3

డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశుల జీవితాల్లో మార్పులు? కేతువు సంచార ఫలితాలు ఇవే..

4

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఏడో రోజు మహాలక్ష్మి దేవిగా దుర్గమ్మ..

5

అక్టోబర్ 24న స్వాతి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

SCR Train Cancellation: భారతీయ రైల్వేలో ప్రయాణించే వారు ఎప్పటికప్పుడు రైలు షెడ్యూల్ అప్‌డేట్స్‌ను గమనిస్తూ ఉండాలి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైళ్లను రద్దు చేస్తూ లేదా మళ్లిస్తూ ఉంటారు. తాజాగా మనోహరాబాద్‌ నాన్‌ ఇంటర్‌ లాకింగ్ పనుల నేపథ్యంలో సెంట్రల్ రైల్వే కొన్ని రైళ్లను క్యాన్సిల్ చేసింది. ఈ రద్దులు నవంబర్ 14 నుండి 22 వరకు వర్తిస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ డివిజన్‌లోని మేడ్చల్ నుండి ఆకన్నపేట సెక్షన్ మధ్య వెళ్లే రైళ్లను ఈ తేదీల్లో రద్దు చేశారు.

రద్దు చేసిన రైళ్ల జాబితా:
77601 కాచిగూడ నుంచి నిజామాబాద్ వెళ్లే రైలును నవంబర్ 14 నుండి 22 వరకు రద్దు చేశారు. 
అలాగే 77602 నిజామాబాద్ నుంచి కాచిగూడ వెళ్లే రైలు కూడా ఈ సమయంలో నడవదు. 
77653 సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లే రైలు, 77654 సిద్దిపేట్ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు నవంబర్ 16 నుండి 22 వరకు రద్దు చేశారు. 
అదే విధంగా 77655 సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లే రైలు, 77656 సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు కూడా నవంబర్ 16 నుండి 22 వరకు నడవవు. 
ఇక 57301 కాచిగూడ నుంచి మెదక్ వెళ్లే రైలు, 57302 మెదక్ నుంచి కాచిగూడ వచ్చే రైలులను నవంబర్ 16 నుండి 22 వరకు రద్దు చేశారు.

నియంత్రిత సమయాల్లో నడిచే రైళ్లు (Regulated):
పైన పేర్కొన్న రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రైళ్లు మాత్రం నియంత్రిత సమయాల్లో నడుస్తాయి. ట్రైన్ నంబర్ 17057 సిఎస్‌టి ముంబై నుంచి లింగంపల్లి వెళ్లే రైలును నవంబర్ 15 నుండి 21 వరకు 60 నిమిషాల పాటు నియంత్రిస్తారు. అలాగే ట్రైన్ నంబర్ 17606 భగత్ కి కోటి నుంచి కాచిగూడ వచ్చే రైలును నవంబర్ 14 నుండి 20 వరకు 75 నిమిషాల పాటు రెగ్యులేట్ చేస్తారు.

ట్రైన్ నంబర్ 17058 లింగంపల్లి నుంచి సీఎస్‌టీ ముంబై వచ్చే రైలును నవంబర్ 16 నుండి 22 వరకు 60 నిమిషాల పాటు, 77605 కాచిగూడ నుంచి పూర్ణా వెళ్లే రైలును కూడా నవంబర్ 16 నుండి 22 వరకు 60 నిమిషాల పాటు రెగ్యులేట్ చేస్తున్నారు.

Read Also: చార్ట్ ప్రిపేర్ అయ్యాక ఖాళీ బెర్త్ చూసుకోవడం ఇక మరింత ఈజీ! IRCTC యాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?
 

కాబట్టి, ఈ రైళ్లలో ప్రయాణించే వారు ముందుగానే ఈ వివరాలను తెలుసుకొని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి. మరోవైపు, దసరా, దీపావళి పండుగ సందర్భంగా భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వందలాది ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో రైలు ప్రయాణాలను పెంచినప్పటికీ, రైల్వే పనుల వల్ల కొన్ని రైళ్లను రెగ్యులేట్ చేయడం లేదా క్యాన్సిల్ చేయడం వంటివి జరుగుతుంటాయి.

 

🚆 Train Cancellation & Regulation Update Due to non-interlocking works at Manoharabad Yard, several trains under South Central Railway will remain cancelled or regulated from 14.11.2026 to 22.11.2026 on specified dates. Passengers are requested to check the updated train schedule before planning their journey. #SouthCentralRailway #TrainUpdate #RailwayAlert #PassengerInformation

— South Central Railway (@SCRailwayIndia) October 16, 2026

 

భారతీయ రైల్వేలో ప్రయాణం సులభతరం కావాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం మంచిది. రిజర్వేషన్ ప్రక్రియ ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది 2 ఏసీ, 3 ఏసీ, జనరల్, స్లీపర్ క్లాసులన్నింటికీ వర్తిస్తుంది. ఒకవేళ అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే, ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉండే తత్కాల్ టికెట్లను ఉపయోగించుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
Indian Railways
National News
Telangana News