• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /చదువుల ఒత్తిడిని మరిచిపోయిన చిన్నారులు.. టీచర్ డ్యాన్స్‌తో క్లాస్‌రూమ్‌లో సందడే సందడి! వీడియో..

చదువుల ఒత్తిడిని మరిచిపోయిన చిన్నారులు.. టీచర్ డ్యాన్స్‌తో క్లాస్‌రూమ్‌లో సందడే సందడి! వీడియో..

Teacher Dance Video: తాజాగా సోషల్ మీడియాలో టీచర్‌కి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆతను పిల్లలో మరింత ఉత్సాహం నింపేందుకు అద్బుతంగా డ్యాన్స్‌ చేశారు. పిల్లలు కూడా ఆయనతో ఆనందంగా డ్యాన్స్‌ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 05, 2026, 12:30 PM IST|Updated: Nov 05, 2026, 12:32 PM IST
joinshare
చదువుల ఒత్తిడిని మరిచిపోయిన చిన్నారులు.. టీచర్ డ్యాన్స్‌తో క్లాస్‌రూమ్‌లో సందడే సందడి! వీడియో..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Teacher Dance Video: స్కూల్స్‌లో ఎప్పుడు పుస్తకాలతో పాటు పరీక్షలు, హోంవర్క్ మధ్య గడిపే చిన్నారులకు కాస్త టైమ్‌ దొరికితే వారి ఆనందానికి అస్సలు అవధులు ఉండనే ఉండవు.. సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే.. ఒక టీచర్‌ చేసిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తోంది. చదువుల ఒత్తిడి నుంచి స్టూడెట్స్‌కి కాస్త ఉపశమనం కలిగించేందుకు ఆయన తరగతి గదినే డ్యాన్స్ ఫ్లోర్‌గా మార్చేశారు. మాస్టారు హుషారైన స్టెప్పులేయడం చూసి.. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా ఆయనతో డ్యాన్స్‌ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సుభాష్ బగారియా అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో అన్ని సోషల్ మీడియాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. దాదాపు 58 సెకన్ల గల ఈ వీడిలో ఓ ప్రైమరీ స్కూల్‌ ఉండడం మీరు చూడొచ్చు.. లైట్‌ బ్లూ కలర్‌ చొక్కా వేసుకుని టీచర్‌.. క్లాస్‌ రూమ్‌లో నిలబడి ఎంతో ఉత్సాహంగా చేతులు పైకెత్తుతూ.. చప్పట్లు కొడుతూ డ్యాన్స్‌ చేయడం మీరు చూడొచ్చు. ముఖ కవళికలతో పాటు చేతుల కదలికలతో ఆయన వేసిన సరదా స్టెప్పులు పిల్లలను ఎంతగానో ఆకర్షించడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు.

ఈ వీడియోలో యూనిఫాంలో ఉన్న విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి ఉత్సాహాన్ని చూసి ఆగలేకపోవడం కూడా మీరు గమనించవచ్చు.. అక్కడే నిలబడి చూడటమే కాకుండా.. కొందరు పిల్లలు ఉత్సాహంతో తమ డెస్క్‌లపైకి ఎక్కి.. మరీ మాస్టారి వేసిన స్టెప్పులను వారు కూడా ఎంతో అద్భుతంగా వేయడం మీరు గమనించవచ్చు.. మరికొందరు తమ బెంచీల దగ్గరే ఉండి.. ఎంతో ఆనందంగా నవ్వుతూ మరీ డ్యాన్స్ చేయడం మీరు గమనించవచ్చు. నిమిషాల వ్యవధిలోనే.. ఆ తరగతి గది మొత్తం నవ్వులు, కేరింతలతో ఒక చిన్నపాటి ప్రోగ్రాంలా అయిపోయింది..

ఈ వీడియోను షేర్ చేసిన సదరు యూజర్.. ఉపాధ్యాయుడి చేసిన పనిని ప్రశంసిస్తూ వచ్చారు. పిల్లల జీవితం కేవలం పుస్తకాలతో పాటు పరీక్షల ఒత్తిడికే పరిమితం కాకూడదని.. ఇలాంటి ఆనందకరమైన ప్రోగ్రామ్స్‌ వారి మానసిక వికాసానికి ఎంతో అవసరమని ఆయన అన్నారు.. చదువుల మధ్య లభించే ఇలాంటి చిన్నపాటి విరామం పిల్లల్లో ఒత్తిడిని దూరం చేసి.. మరింత ఉత్తేజంతో తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

 

Such a wonderful video..!! Every child deserves such happiness and fun. A little break from studies keeps them refreshed and stress-free. Hats off to the amazing teacher for spreading so much joy..!! ❤️ https://t.co/k3sPsSMf2c

— Subhash Bagaria (@techsolutions92) November 3, 2026

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
Viral News