Tiger Shroff Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. భారీగా డబ్బు ఆఫర్, విదేశాల్లో ఉద్యోగం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.!.
Tiger shroff firing case: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కాల్పుల ఘటనలో ఇప్పటికే ముంబై పోలీసులు ముగ్గురు అనుమానితుల్ని రాజస్తాన్ లోని కోటాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మరో అనుమానితుడ్ని హర్యానాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
Bolly wood actor Tiger Shroff firing case update: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటనపై ముంబై పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయ్యింది. ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించేదిలేదని తెల్చి చెప్పింది. ఇప్పటికే ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు అనుమానితుల్ని రాజస్తాన్ లోని కోటాలో పోలీసులు అరెస్ట్ చేశారు.టైగర్ ష్రాఫ్ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఒకరి వయసు 18, ఇద్దరి వయసు 22 గా అని, ఇద్దరు హర్యానా, ఒకరు బీహర్కు చెందిన వారిగా ముంబై పోలీసులు గుర్తించారు. వీరిని విచారిస్తున్నారు.
అయితే.. తాజాగా.. పోలీసులు హర్యానలో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతని పేరు రెహన్ అని. విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్ స్టర్ అనిత్ పండిత్ కు మంచి నమ్మకస్తుడిగా పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా.. కాల్పుల జరిపిన వారికి గ్యాంగ్ స్టర్ అనిల్ పండిత్.. రూ. 35 వేలతో పాటు, విదేశాల్లో జాబ్ కూడా ఆఫర్ ఇస్తానని చెప్పినట్లు పోలీసులు విచారణలో బైటపడింది.
ఈ నేరం చేసేలా రెహాన్‌ను గ్యాంగ్‌స్టర్ అనిల్ ప్రలోభపెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మరోవైపు టైగర్ ష్రాఫ్ మాత్రం తనను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేశారో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకు ఎవరితోను శత్రుత్వంలేదని, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండేతో పై విధంగా మాట్లాడారు. కాల్పుల ఘటన రోజున అభిమానులతో ఫోటొలు దిగక పోవడం మంచిదైందని టైగర్ ష్రాఫ్ డిప్యూటీ సీఎంతో చెప్పుకొచ్చాడు.