Tiger Shroff firing: టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. రాజస్థాన్‌లో ముగ్గురు షూటర్ల అరెస్ట్..
Tiger shroff gun fire row: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై ముంబైలో జరిగిన హత్యయత్నం ఘటనలో స్థానిక పోలీసులు 15 టీమ్ లను రంగంలోకి దింపాయి. ఈ క్రమంలో ముగ్గురు అనుమానితుల్ని కోటా రైల్వేస్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tiger shroff mumbai car firing case three suspects arrested: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటనతో ముంబై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే 1998 నాటి కృష్ణ జింకల వేట ఘటనలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. పలు మార్లు ఆయనపై కాల్పులకు కూడా తెగబడింది. ఇక తాజాగా.. ఆయన సన్నిహితులను కూడా ఈ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు ఇటీవల జరిగిన ఘటనతో బైటపడింది.
ముంబై పశ్చిమ శివారు ప్రాంతంలో నిన్న కాల్పుల ఘటన జరిగింది. జుహులోని పుష్పా పార్క్ దగ్గరలో.. నటుడు ష్రాఫ్ ఫుట్‌బాల్ సెషన్ తర్వాత కారులో వెళ్తున్నాడు. ఇంతలో తెల్లని షర్ట్ లు వేసుకున్న దుండగులు బైక్ పై వచ్చి ష్రాఫ్ కారు పై ఐదు రౌండ్ల వరకు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ష్రాఫ్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ష్రాఫ్ కు చిన్నపాటి గాయాలయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన తన డ్రైవర్ ను టైగర్ ష్రాఫ్ కారులో కూర్చుండబెట్టి తనే డ్రైవింగ్ చేస్తు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మొత్తంగా నిన్న పెద్ద ఘటనన నుంచి హీరో ష్రాఫ్ బైటపడ్డాడు. దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని 15 టీమ్ లను రంగంలోకి దింపాయి.
అయితే.. నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు షూటర్లను కోటా రైల్వే స్టేషన్ రాజస్థాన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ కు
లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పట్టుబడ్డ వారిలో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పక్కా ప్లాన్ తోనే టైగర్ ష్రాఫ్ పై కాల్పులకు నిందితుడు తెగబడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ కాల్పులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముంబైలో ఇలాంటి ఘటనలు జరగనివ్వబోమని తెల్చి చెప్పారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ కాల్పుల ఘటనతో దసరా పండగ వేళ ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.