SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vande Bharat Sleeper: ఏపీకి భారీ శుభవార్త.. రెండు ప్రధాన నగరాల మధ్య వందే భారత్‌ స్లీపర్‌ రైలు

Vande Bharat Sleeper Ready To Launch In October From Bengaluru To Mumbai: ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణికులకు భారీ శుభవార్త. రెండు ప్రధాన నగరాల మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు పరుగులు పెట్టబోతున్నది. ఈనెలలో ఆ రైలును ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. వందే భారత్‌ స్లీపర్‌ రైలు విశేషాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 02, 2026, 10:56 PM IST | Updated: Oct 02, 2026, 11:00 PM IST
Image Credit: Source: Twitter
Join

Bengaluru To Mumbai Trains: ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ శుభవార్త వినిపించింది. వందే భారత్‌ స్లీపర్‌ రైలును రెండు ప్రధాన నగరాల మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి ఐటీ రాజధాని బెంగళూరు మధ్య వందే భారత్‌ స్లీపర్‌ రైలును వేశారు. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య వేసిన రైలు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రధాన ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనుంది. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే వందే భారత్‌ రైలులో స్లీపింగ్‌తో వచ్చిన ఈ రైలు రావడంతో మూడు రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతో ఉపశమనం లభించనుంది.

రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన వసతులు కల్పించే దిశగా వందే భారత్‌ స్లీపర్‌ రైలును ముంబై- బెంగళూరు మధ్య వేశారు. బెంగళూరు నుంచి ముంబై మధ్య ఇది రెండో వందేభారత్ స్లీపర్ రైలు కావడం విశేషం. దసరా పండుగ సందర్భంగా ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ఇప్పటికే రాకపోకలు సాగిస్తున్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానాలకు చేరేందుకు సుదీర్ఘ సమయం తీసుకుంటోంది. ఈ రైలు 22 గంటల సమయం తీసుకుంటుండడంతో ఈ మార్గంలో మరో వందేభారత్ స్లీపర్ రైలును వేశారు. ఈ రైలు ద్వారా ప్రయాణ సమయం 16 గంటలకు తగ్గనుంది. దీంతో ఈ నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు సమయం ఆదా కానుంది.

ఎక్కడెక్కడ హాల్ట్ అంటే?
రెండు నగరాల మధ్య దూరం 984 కిలోమీటర్లు ఉండగా.. కేఎస్ఆర్ బెంగళూరు- ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ రైలు అనంతపురం, గుంతకల్, రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ మీదుగా ప్రయాణం చేయనుంది. ఆయా ప్రధాన స్టేషన్లలో ఈ రైలు కొన్ని సెకన్ల పాటు ఆగనుంది. వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును వారంలో ఆరు రోజులు నడిపేలా రైల్వే శాఖ ప్రణాళిక చేస్తోంది.

సమయం
బెంగళూరులో ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు బయలుదేరనున్న ఈ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకుంటుంది. 
ముంబైలో రాత్రి 10:30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.

ఈ రెండు రోజులు బంద్‌
ఈ రైలు బెంగళూరు నుంచి సోమవారం, ముంబై నుంచి మంగళవారం అందుబాటులో ఉండదు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES