SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Karnataka: వామ్మో..యూట్యూబ్ చూసి భర్త హత్యకు స్కెచ్..ఇడ్లీలో ఉమ్మెత్త పొడి కల్పి మరీ దారుణం.!.

Wife kills husband in Karnataka: కొన్ని రోజులుగా యూట్యూబ్ ను చూసి భార్యతో పాటు, ఆమె ప్రియుడు భర్త హత్యకు ప్లాన్ చేశారు. కర్ణాటకలోని హుణసూరులో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.

Written By Inamdar Paresh
Published: Oct 24, 2026, 09:37 AM IST | Updated: Oct 24, 2026, 09:54 AM IST
Image Credit: karnataka news
Join

Wife kills husband in Karnataka: సమాజంలో  కొంత మంది మానవత్వానికి మాయని మచ్చలా మారుతున్నారు. చక్కగా పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా ఉండకుండా కట్టుకున్న వారిని కడతెరుస్తున్నారు. చిన్న చిన్నగొడవల్ని పెద్దదిచేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. భార్యభర్తలు ఒకర్ని మరోకరు చంపుకుంటూ వివాహ బంధాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని  హుణసూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని హుణసూరులో  రామ్ ప్రసాద్, పవిత్రలు ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకుకు 11 ఏళ్లు, కూతురికి 9 ఏళ్లు. అయితే రామ్ ప్రసాద్ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. 

అయితే.. పవిత్రకు ఇటీవల స్థానికంగా ఉండే  సునీల్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. తరచుగా భర్తను తెలియకుండా ఇద్దరు కలుసుకునే వారు. ఇక భర్తను ఎలాగైన అడ్డు తొలగించుకొవాలని పవిత్ర అతని ప్రియుడు  భావించారు. ఇటీవల  భర్తకు ఫుల్ గా మద్యం తాగించారు. ఆ తర్వాత యూట్యూబ్ లో చూసి ఉమ్మెత్తపువ్వు పొడిని ఇడ్లీలో కల్పి తినిపించారు. 

దీంతో రామ్ ప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పవిత్ర  తన భర్త కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన భర్త మాట్లాడట్లేదని చెప్పింది. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. దీంతో రామ్ ప్రసాధ్ సోదరుడు తన వదినపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో తమ వివాహేతరం సంబంధం గురించి బైటపెట్టింది. వెంటనే పోలీసులు పవిత్రను ఆమె ప్రియుడు సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES