Lucknow: ఓర్నీ.. గుడిలో దేవుడికి దండం పెట్టి మరీ యువతి ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..
Woman stealing jewellery in up temple: లక్నోలోని ఆలయంలో యువతి సీక్రెట్ గా గుడిలోకి ప్రవేశించి లక్ష్మీదేవి అమ్మవారి మీదున్న గొడుగును, కిరీటంతో పాటు పలు ఆభరణాల్ని యువతి తీసుకుని అక్కడినుంచి పరారయ్యింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.
Woman allegedly stealing goddess Lakshmi jewellery in lucknow: సమాజంలో ఇటీవల కొంత మంది యువతి, యువకులు జల్సాలకు అలవాటుపడ్డారు. కష్టపడి చదవడం లేదా ఉద్యోగాలు చేయడం వంటివి అస్సలు చేయడం లేదు. ఇంట్లో లేదా బైట చోరీలు చేస్తున్నారు. ముఖ్యంగా బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగిపోయినప్పటి నుంచి చోరీలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసుకుని మరీ చోరీలు చేస్తున్నారు. ఇక గుడి, ఇళ్లు, అని తేడా లేకుండా రెక్కి వేసి మరీ చోరీలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఒక యువతి గుడిలోకి వచ్చి చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది. సఆదత్ గంజ్ లో ఉన్న చారోంధామ్ గుడిలో యువతి ప్రవేశించింది. ఆ తర్వాత అటు ఇటు చూసింది. గుడిలో ఉన్న వెండి గొడుగు, మహాలక్ష్మి అమ్మవారి బంగారు ఆభరణాలపై ఆమె కన్ను పడింది. ఇంతలో ఆమె నెమ్మదిగా గుడిలోకి ప్రవేశించింది. గొడుగును, బంగారం ఆభరణాల్ని సెకన్ల వ్యవధిలో బైటకు వచ్చింది. ఇక తనకు ఏమి తెలియదన్నట్లు అక్కడి నుంచి కూల్ గా జారుకుంది. ఆతర్వాత అక్కడకు వచ్చి చూసిన పండితులు, స్థానికులు ఘటనను గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఒక యువతి చోరీకిపాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. గుడిలో ఈ అరాచకం ఏంటని కొంత మంది కామెంట్స్ చేస్తుంగా, మరికొంత మంది కిలేడీ భలే స్కెచ్ వేసిందిగా అంటూ ఏకీపారేస్తున్నారు.