Woman run 1600 meters barefoot in saree for homeguard job in Jharkhand: మనలో చాలా మంది ఎన్ని వసతులు ఉన్నా, ఇంట్లో వారు ప్రొత్సహిస్తున్న ప్రతిదాంట్లో సాకులు వెతుకుంటారు. తమ ప్రయత్నలోపం వల్ల గొప్ప విజయాలు సాధించలేకపోతారు. పైగా వీరి లోపాలను ఇతరుల మీద రుద్దుతారు. కానీ మరికొంత మంది దీనికి భిన్నంగా ఉంటారు.
Barefoot. In a saree. Running for a Home Guard job. 🥹 No spikes. No tracksuit. No coaching. Just a dream and her determination. Ramgarh, Jharkhand 🇮🇳 She ran like her whole future depended on it. Because it did. https://t.co/QPgcHnBY2K
— News Matrix (@NewsMatrixIND) October 6, 2026
తమకు ఎలాంటి ప్రొత్సహంలేకున్న, సాధించాలనే తపనను మాత్రమే తమ టార్గెట్ గాపెట్టుకుంటారు. జీవితంలో గొప్ప లక్ష్యాలను పెట్టుకొవడం మాత్రమే కాకుండా దాన్ని సాధించే వరకు నిద్రపోరు. ఈ క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురైన వాటిని మొక్కవొని ధైర్యంతో ఈజీగా అధిగమిస్తారు. ఈ క్రమంలో జార్ఖండ్‌లోని రామ్ గఢ్ లో ఒక మహిళ సర్కారు కొలువు కోసం చేసిన సాహాసం ప్రస్తుతం అందరి మనస్సులను కదిలించింది.
జార్ఖండ్‌లో ఇటీవల ప్రభుత్వం హోంగార్డ్ జాబ్ ల కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. అయితే.. దీనికి చాలా మంది అప్లై చేసుకున్నారు. రామ్‌గఢ్‌కు చెందిన కవితా కుమారి సైతం ఈ పోస్ట్ ల కోసం అప్లై చేసింది. దీనిలో భాగంగా ఈవెంట్ లలో కూడా పాల్గొంది. అయితే.. కవిత కుమారీ హోంగార్డ్ ఉద్యోగ ఎంపికల కోసం 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంది.
దీనిలో ఆమె చీరకట్టులో, కనీసం కాళ్లకు షూస్ కూడా లేకుండానే మిగత వారితో పోటీ పడి మరీ మొక్కవొని పట్టుదలతో.. 1600 మీటర్ల పరుగు పందెన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేసి విజయాన్ని సాధించింది.
కాళ్లకు ఎలాంటి స్పోర్ట్స్ గేర్, ట్రాక్‌సూట్ లేదా కనీసం రన్నింగ్ షూస్ కూడా లేకపోయినా.. కేవలం చీరకట్టుతోనే మైదానంలోకి దిగింది. ఆమె నిర్దేశించిన 10 నిమిషాల సమయం కంటే ముందే, కేవలం 6 నిమిషాల్లోనే ఆమె 1600 మీటర్ల పరుగును పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మండుతున్న ఎండలో, నడుముకు చీర కొంగును గట్టిగా కట్టుకుని ఆమె పరిగెత్తిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.
కటిక పేదరికంలో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కుటుంబానికి అండగా నిలవాలనే ఆమె సంకల్పానికి దేశవ్యాప్తంగా నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక డిఫెన్స్ అకాడమీ సభ్యులు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి శాలువాతో సత్కరించారు.