NAMO Records: గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబర్ 7న బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ.. నాటి నుంచి నేటి వరకు, ప్రధానమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రభుత్వ అధినేతగా నిరంతరాయంగా 25 యేళ్లు పూర్తి చేసుకున్నారు. పాతికేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన అతికొద్ది మంది ప్రపంచ నేతల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. స్వతంత్ర్య భారత చరిత్రలో స్వాతంత్య్రం తర్వాత పుట్టిన ప్రైమ్ మినిష్టర్ అయిన తొలి నాయకుడిగా నరేంద్ర మోడీ రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు ప్రజల చేత ఎలెక్ట్ కాబడ్డ ప్రధాని మంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోడీ ఖాతాలో మరో రికార్డు ఉంది.
భారతదేశంలో ఎన్నికైన ప్రభుత్వానికి అధిపతిగా సుదీర్ఘకాలం పనిచేసిన రికార్డును నరేంద్ర మోడీ ఇప్పటికే దాటారు. గతంలో ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ నేత అయిన చామ్లింగ్ డిసెంబర్ 1994 నుంచి మే 2019 వరకు మొత్తం 24 సంవత్సరాల 165 రోజుల పాటు సుదీర్ఘ కాలం పనిచేశారు. మన దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేశారు. ఆయన రికార్డును గతేడాదే క్రాస్ చేశారు.
మోడీ ఎలక్టెడ్ ప్రధాని.. నెహ్రూ తొలిసారి సెలెక్ట్ ప్రధాని..
స్వాతంత్రం తర్వాత తొట్ల తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసార్లు ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా నరేంద్ర మోడీ రికార్డు క్రియేట్ చేశారు. భారత దేశానికి బ్రిటిష్ వాళ్లు ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్య భారత దేశంలో ప్రధానిగా నామినేట్ చేయబడ్డారు. ఆ తర్వాత మన దేశం గణతంత్య్రం అయిన తర్వాత 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో భారత దేశ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధాన మంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ రికార్డు క్రియేట్ చేశారు.
మన దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన జ్యోతిబసు కూడా ఉన్నారు. బిజూ జనతాదళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ మార్చి 2000 నుంచి జూన్ 2024 వరకు 24 సంవత్సరాల 99 రోజుల పాటు ముఖ్యమంత్రిగా సేవలు . సీపీఎం నేత జ్యోతిబసు జూన్ 1977 నుంచి నవంబర్ 2000 వరకు 23 సంవత్సరాల 137 రోజుల పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో అమలు చేసిన భూ సంస్కరణలు, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. అటు త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగారు.
31 యేళ్లుగా లీ క్వాన్ యూ రికార్డు..
ఇంటర్నేషనల్ లెవల్లో చూస్తే, సింగపూర్ ఫస్ట్ ప్రైమ్ మినిష్టర్ ప్రధాని లీ క్వాన్ యూ 1959 నుంచి 1990 వరకు ఏకంగా 31 ఏళ్లు కంటిన్యూగా అధికారంలో ఉన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో సుదీర్ఘ పాలనకు ఆయనను ఒక ఆధునిక కొలమానంగా పరిగణిస్తారు. ఆయన నాయకత్వంలో సింగపూర్ పేదరికం నుంచి ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ఎదిగింది. కంబోడియాలో హున్ సేన్ 1985 నుంచి 2023 వరకు ప్రధానిగా పనిచేసి, ఆధునిక ప్రపంచంలో ఎక్కువ కాలం పనిచేసిన నేతల్లో ఒకరిగా నిలిచారు. మలేషియాలో మహతీర్ మొహమ్మద్ రెండు పర్యాయాల్లో కలిపి 24 ఏళ్లకు పైగా ప్రధానిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం.
ప్రభుత్వాధినేతగా 25 యేళ్ల ప్రస్థానం..
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత పోటీతత్వ ప్రజాస్వామ్యంలో వరుస ఎన్నికల విజయాలతో ఈ 25 ఏళ్ల మైలురాయిని చేరుకోవడం మోదీ విషయంలో ఒక ప్రత్యేకతగా నిలుస్తోంది. "వికసిత భారత్" లక్ష్యంతో ఆయన ప్రస్థానం ఇంకా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న అనేక మంది నేతలు వివాదాస్పద పాలకులుగా ముద్రపడగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికవుతూ మోదీ ఈ ఘనత సాధించడం గమనార్హం.
ప్రధాని మంత్రిగా మోడీకి సాధించిన ఘనతలు..
స్వచ్ఛ భారత్ మిషన్, జన్ ధన్ యోజనతో పేద ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడం.. నోట్ల రద్దు.. సర్జికల్ స్ట్రైక్స్.. ఆపరేషన్ సింధూర్‌తో పాక్ వెన్నులో వణుకు పుట్టించిన నేతగా ప్రధాని మోడీకి ప్రత్యేక గుర్తింపు. చైనాకు గల్వాన్ లోయలో బుద్ధి చెప్పడం, అమెరికా అంక్షలకు భయపడకపోవడం, యూపీఐ ట్రాన్సాక్షన్.. రైల్వేల సమగ్ర అభివృద్ది, వందే భారత్ వంటి రైల్వేల ఏర్పాటు.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం.. రక్షణ రంగంలో స్వావలంభన.. 81 కోట్ల మందికి ఉచిత రేషన్‌తో పేదరికం నుంచి విముక్తి. ఆత్మనిర్భర్ భారత్‌తో స్వదేశీ తయారీపై దృష్టి.. దేశ వ్యాప్తంగా ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ విద్యాసంస్థలతో పాటు మెడికల్ సీట్లను భారీగా పెంచడం, మన్ కీ బాత్, త్రిపుల్ తలాక్ రద్దు.. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. విశ్వకర్మ పథకంతో చేతివృత్తుల వారికి సాయం అందించడం. నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించడం. రవాణా రంగంలో కొత్త సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన, నదుల అనుసంధానికి ప్రాధాన్యత, కోవిడ్ మహామ్మారిని చాకచక్యంగా అధిగమించడం. జీఎస్టీ, వాణిజ్య సంస్కరణలు, మత ఘర్షణల నివారణ, ఈశాన్య భారతంలో టెర్రిరిజానికి ముగింపు. జమ్మూ కశ్మీర్‌లో కనిష్ట స్థాయికి చేరిన ఉగ్రవాదం, వరుసగా మూడు పార్లమెంట్ ఎలక్షన్స్‌లో గెలపు, గుజరాత్‌లో మూడు సార్లు గెలుపు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.