SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'జీ ఎంటర్‌టైన్‌మెంట్' 34 ఏళ్ల విజయ ప్రస్థానం.. వినోద రంగంలో సరికొత్త విప్లవానికి సన్నద్ధం..

ZEE Entairment@34Years: దూరదర్శన్ తప్పించి మరో వినోద మాధ్యమం అంటూ తెలియని భారతీయ ప్రేక్షకులకు సరిగ్గా 34 యేళ్ల క్రితం ప్రైవేటు టెలివిజన్‌ ఛానెల్‌గా ప్రారంభమైన జీ ఎంటర్మైన్మెంట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించింది. అందిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తన తాను అప్‌డేట్ చేసుకుంటూ జీ ప్రస్థానం విషయానికొస్తే.. ఇంతింతై అన్నట్టుగా సాగి ఎన్నో ప్రైవేటు ఛానెల్స్ మన దేశంలో రావడానికి దోహదం చేసిందనడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ సందర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ 34 యేళ్ల ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్..

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 01, 2026, 05:09 PM IST | Updated: Oct 01, 2026, 05:13 PM IST
Image Credit: ZEE Entairtainments (X/Source)
Join

ZEE Entairtainments: సరిగ్గా 34 యేళ్ల క్రితం భారతీయ వినోద రంగంలో జీ టీవీ పేరుతో సరికొత్త విప్లవానికి నాందీ పలికింది.  బిందువు, బిందువు కలిపి సింధువు అయినట్టు సరిగ్గా 34 ఇయర్స్ కింద ప్రారంభమైన జీ టీవీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.  కొత్తగా పోటీలో వచ్చిన ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్‌‌తో న్యూస్ ఛానెల్స్‌‌తో పోటీ పడుతూ  తన కంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.  గత 34 ఏళ్లుగా భారతీయ వినోద పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్, భవిష్యత్ అభివృద్ధి కోసం పలు కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. కేవలం వినోదం రంగం మాత్రమే కాదు..న్యూస్, డిజిటల్  ప్లాట్‌ఫారమ్‌లు, సినిమాలు, సంగీతం, క్రీడలు, మినిసిరీస్‌లు, పిల్లల వినోద కార్యక్రమాల వంటి రంగాలలో తన ఉనికిని విస్తరించే ప్రణాళికతో జీ సంస్థ పనిచేస్తోంది. సాంకేతికంగా కొత్తగా వచ్చే వాటిని అడాప్ట్ చేసుకుంటూ ఎప్పటికపుడు ప్రేక్షకులకు నాణ్యమైన కంటెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ అయింది.

ముంబై, అక్టోబర్ 1, 2026:

భారత మీడియా, వినోద (M&E) రంగానికి మార్గదర్శిగా నిలిచిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీ/Z) విజయవంతంగా 34 యేళ్లు  పూర్తి చేసుకుంది. ఎప్పటికపుడు కొత్త సాంకేతికలు, వినోద పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్ వినోదానికి ఒక కొత్త కోణాన్ని సృష్టించే దిశగా కృషి చేస్తోంది.

34 ఏళ్ల తన విశిష్ట వారసత్వాన్ని, సామర్థ్యాలను నేటి సాంకేతిక అవకాశాలతో మేళవిస్తూ, 'అటెన్షన్ ఎకానమీ'లో అగ్రభాగాన్ని దక్కించుకునేందుకు సమగ్రమైన, అద్భుతమైన వినోద అనుభవాలను వీక్షకులకు అందిస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక ఆధారిత వ్యాపార నిర్మాణాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

34వ వార్షికోత్సవం సందర్భంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పునీత్ గోయెంకా మాట్లాడుతూ..

జీ 34 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో  ఆవిష్కరణలకు మూలంగా నిలిచింది.  జీ బ్రాండ్‌తో మా వినియోగదారులు, వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములకు విలువను సృష్టించడమే లక్ష్యంగా మా సంస్థ ప్రయాణం  సాగింది. ఈ గొప్ప వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, సంస్థ భవిష్యత్ వృద్ధికి మరింత పటిష్టమైన కార్యాచరణను రూపొందించినట్టు చెప్పుకొచ్చారు. కంటెంట్, సాంకేతికత, ప్రతిభ (Talent) రంగాలలో అవసరమైన పెట్టుబడులు పెడుతూ పోటీతత్వాన్ని మరింత పెంచుకుంటున్నామన్నారు.  'జీ' ప్రయాణంలో రాబోయే అధ్యాయం అత్యంత విశిష్టమైనదిగా పేర్కొన్నారు.  రాబోయే మూడు దశాబ్దాల పాటు ఈ పరిశ్రమను ముందుకు నడిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.

వినోదం ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యమన్నారు. అదే స్పూర్తితో మా సంస్థ ముందుకు సాగుతోందన్నారు. అనుభవజ్ఞులైన బోర్డు మార్గదర్శకత్వంలో పాలనా యంత్రాంగాన్ని (గవర్నెన్స్), అంతర్గత ప్రక్రియలను నిరంతరం మెరుగుపరుస్తూ దీర్ఘకాలిక విలువలను సృష్టిస్తోందన్నారు. మూలధన కేటాయింపులు, లాభదాయకతపై స్పష్టమైన దృష్టి సారిస్తూ జీ తన వ్యాపారాన్ని విస్తరిస్తోందని చెప్పుకొచ్చారు.

సంస్థ వృద్ధికి తోడ్పడుతున్న 9 ప్రధాన విభాగాలు..

1. వివిధ భాషల్లో పటిష్టమైన కంటెంట్: విభిన్న భారతీయ భాషల్లో నాణ్యమైన కంటెంట్‌ను అందిస్తూ వీక్షకుల ఆదరణను, నెట్‌వర్క్ వాటాను పెంచుకోవడం.


2. డిజిటల్ విభాగంలో నిరంతర లాభదాయకత: 7 భాషల వ్యూహం, ఆకర్షణీయమైన కథనాలు,  కొత్త  యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) ద్వారా డిజిటల్ రంగంలో నిలకడైన లాభాలు సాధించడం.


3. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలతో పాటు మ్యూజిక్  విభాగంలో  విస్తృత ప్రేక్షకాదరణ పొందే వైవిధ్యభరితమైన చలనచిత్రాలు, సంగీత భరితమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించడం.


4. ఓమ్నీ-ఛానల్ విస్తరణ:*దేశవ్యాప్తంగా ప్రతినెలా **80 కోట్లకు (800 మిలియన్లు) పైగా యూనిక్ వీక్షకులను చేరుకుంటున్న పటిష్టమైన నెట్‌వర్క్ జీ.  


5. మైక్రో డ్రామాలతో షార్ట్-ఫార్మ్ కంటెంట్: మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా షార్ట్-ఫార్మ్,  మైక్రో డ్రామాలలో విస్తరణ.


6. క్రీడా రంగంలో పట్టు: స్థానిక, అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రాపర్టీలతో పటిష్టమైన క్రీడా వ్యాపారం.


7. లైవ్ ఈవెంట్స్ఫ వినియోగదారులను నేరుగా ఆకట్టుకునేలా మరింత ఉత్తేజకరమైన లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాలు.


8. పిల్లల వినోదం & యానిమేషన్: యానిమేషన్, పిల్లల కంటెంట్‌తో వినియోగదారుల పరిధిని మరింతగా విస్తరించుకోవడం.


9. వ్యాపార భాగస్వామ్యాలు & సినర్జీలు: సిండికేషన్, డిస్ట్రిబ్యూషన్, బ్రాడ్‌బ్యాండ్ వంటి విభాగాల మధ్య పరస్పర సహకారంతో మెరుగైన ఫలితాలు సాధించడం.


మానవ వనరుల సాధికారత & భవిష్యత్ కార్యాచరణ..

సంస్థ తన కార్యాచరణ సామర్థ్యాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు అత్యంత విలువైన ఆస్తి అయిన మానవ వనరుల సాధికారతకు ప్రాధాన్యతనిస్తోంది. బృందాలలో జవాబుదారీతనాన్ని పెంచుతూ, రేపటి నాయకులను తీర్చిదిద్దుతోంది.

బలమైన కంటెంట్ ఇంజిన్, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో భారత్ నుంచి ప్రపంచ వినోద రంగాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ గురించి:

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా లీనియర్ టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సినిమాలు, సంగీతం మరియు లైవ్ ఈవెంట్ల ద్వారా నాణ్యమైన కంటెంట్‌ను అందిస్తున్న ప్రముఖ టెక్నాలజీ-వినోద సంస్థ. ప్రస్తుతం ఇది 190కి పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు (1.4 బిలియన్లు) పైగా ప్రజలను చేరుకుంటోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES