తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 81,516 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. అయితే, తిరుమలలో కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా రేపు నవంబర్ 24న కార్తీక పర్వదీపోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ప్రతినెలా పౌర్ణమి రోజు నిర్వహిస్తున్న గరుడ సేవ ఈ నెలకు రద్దు చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్తీక శోభ నెలకొంది. సాధారణంగానే భక్తులతో కిటకిటలాడే తిరుమలలో రేపు మరింత అద్భుతమైన ఘట్టం నిర్వహించనున్నారు. నవంబర్ 24వ తేదీ కార్తీక దీపోత్సవం జరగనుంది.
2/5
తిరుమల తిరుపతి దేవస్థానం
ఈ సందర్భంగా సాయంకాల కైంకర్యాలు శ్రీవారికి నిర్వహించిది దీపోత్సవం చేస్తారు. నేతి వత్తులతో దీపాలు, ఛత్రతామర, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విమాన ప్రదక్షిణ చేస్తారు.
3/5
తిరుమలలో గరుడసేవ
తిరుమలలోని అన్ని ప్రముఖ ప్రాంతాలలో దీపాలను వెలిగిస్తారు. అయితే, ప్రతి నెలా పౌర్ణమి రోజు నిర్వహించే గరుడ సేవ మాత్రం ఈ నెలకు రద్దు చేసింది టీటీడీ. కార్తీక దీపోత్సవం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ కూడా రద్దు చేశారు.
4/5
టీటీడీ
ప్రతి ఏడాది తిరుమలలో ఈ కార్తీక మాసం ప్రత్యేక ఏర్పాట్లు, వేడుకలు నిర్వహిస్తారు. సాయం కాలం 5 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ ఉత్సవం జరగనుంది.
5/5
నవంబర్ 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
తిరుమలలో నిన్న ఒక్కరోజే 81,516 మంది దర్శించుకోగా, 25,547 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చింది. ఈరోజు ప్రస్తుతం రద్దీ 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి గరిష్టంగా 8 గంటల సమయం పడుతోంది.