Rukmini Vasanth Planning: యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ తర్వాత రుక్మిణి వసంత్ మనసు మార్చుకుందా.. ? స్టార్ హీరోల వెంట పడకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ కథలే కావాలంటున్నారా..? రుక్మిణి వసంత్ ఎందుకు సడెన్‌గా యూ టర్న్ తీసుకున్నారు..? కన్నడతో పాటు అన్ని భాషల్లోనూ ఫీమేల్ సెంట్రిక్ కథల వైపు రుక్మిణి అడుగులు వేస్తున్నారా..? కెరీర్ కోసం ఈ కన్నడ భామ చేస్తున్న ప్లాన్స్ వర్కౌట్ అయ్యేనా..?
1/5
రుక్మిణి వసంత్ న్యూ ప్లాన్స్
Rukmini Vasanth New Plans: కాంతార చాప్టర్ 1 విడుదలైంత వరకు రుక్మిణి వసంత్ పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ‘కాంతార ఛాప్టర్ 1’లో కనకవతి పాత్రతో వచ్చేసింది. ఈ సినిమా సక్సెస్ తో రక్మిణి వసంత్ పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల ప్రశసంలు సైతం అందుకుంది. ప్రస్తుతం నటనకు ఆస్కారం ఉన్న పాత్రల కోసం ఈమె పేరును సజెస్ట్ చేస్తున్నారు చాలా మంది ఫిల్మ్ మేకర్స్.
2/5
కన్నడ భామ
రుక్మిణి వసంత్.. కన్నడలో ‘సప్తసాగర్ దాతి’ చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే తన గ్లామర్ తో పాటు నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో రుక్మిణి వసంత్.. నిఖిల్ హీరోగా నటించిన ‘అపుడో ఇపుడో ఎపుడో’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ యేడాది యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడం హీరోగా యశ్‌తో పాటు కథానాయిక రుక్మిణి వసంత్‌కు బిగ్ షాకింగ్ పరిణామం అని చెప్పాలి.
3/5
గ్లామర్ డాల్
ఇకపై స్టార్ హీరోల పక్కన కేవలం గ్లామర్ డాల్‌గా చేయడం కంటే కథను తన భుజాలపై మోసే లేడీ ఓరియెంటెడ్ ఇమేజ్ ఉన్న సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. అందుకే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్‌కే ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రుక్మిణి చేతిలో ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులే ఉన్నాయి. కన్నడలో ‘మంగళ గౌరి’ అనే క్రేజీ సినిమాలో టైటిల్ రోల్ చేస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘డ్రాగన్’ మూవీలో నటిస్తోంది. అలాగే మలయాళంలో నివిన్ పౌలీ 51వ చిత్రంలో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఇలా ఒకేసారి సౌత్ ఇండస్ట్రీని మొత్తం కవర్ చేస్తూ వరుస ఆఫర్స్‌తో స్పెషల్ మార్క్ క్రియేట్ చేస్తోంది.
4/5
ఫన్నీ వీడియో
తాజాగా ఒకే ఒక జీవితంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ తన కొత్త ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దేవ్ రామ్‌నాథ్, వినాయక్ వైద్యనాథన్ లాంటి యంగ్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను ఒక ఫన్నీ వీడియోతో రివీల్ చేయడం విశేషం. ఇందులో తార పాత్రలో నటిస్తున్నారు రుక్మిణి.
5/5
రుక్మిణి కొత్త చిత్రం
తార క్యారెక్టర్ కోసం హీరోయిన్ దొరకట్లేదని, మనకు టైమ్ అయిపోతుందని డైరెక్టర్ శ్రీకార్తిక్ తన యాక్టర్స్‌తో టెన్షన్‌గా డిస్కస్ చేస్తుండగా ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ఫన్నీగా మొదలవుతుంది. మొత్తానికి లేడీ ఓరియెంటెడ్ కథలతో ఇమేజ్ మేకోవర్ కోసం రుక్మిణి ప్రయత్నించడాన్ని మెచ్చుకోవాల్సిందే.