School Holiday in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వరుస తుపానులు వణికిస్తున్నాయి. తుపాను ధాటికి తీర ప్రాంతంలోని రోడ్డు కోతకు గురైంది. కొన్ని విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల కరెంట్ లేక ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాల్లో అధికారులు సెలవులు ప్రకటించారు.
1/5
ఏపీ స్కూల్ హాలీడేస్
School Colleges Holidays in AP: మురాసు తుపాను.. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు స్కూళ్లకు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరోవైపు అంగన్ వాడీ కేంద్రాలకు జిల్లా యంత్రాంగం సెలవులు ప్రకటించింది.
2/5
తీవ్ర ఇబ్బందులు
చుట్టూ నీరు ఉన్న గుక్క నీరు తాగునీరు లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు భీకరమైన తుపాను ధాటికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు ఎన్నో చోట్ల విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
3/5
ప్రతికూల వాతావరణం
ఏపీలో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఈ రోజు , రేపు సెలవును ప్రకటించారు. అయితే పరిస్థితులను బట్టి ఈ సెలవులను పొడిగించే అవకాశం ఉంది.
4/5
స్కూల్ హాలీడేస్
ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను విద్యుత్ పునరుద్దరణ పనులు నిమిత్తం అక్కడి సిబ్బందిని పంపించాలని విజ్ఞప్తి చేశారు.
5/5
తుపాను ఎఫెక్ట్
తుపాను వల్ల జిల్లాపై పడబోయే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయా జిల్లాల డీఈవోలు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా యంత్రాంగం జారీ చేసిన సూచనలను పాటించాలని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సూచించడం జరిగింది.